ఏపీలో నెక్ టు నెక్: నెగ్గేది ఆ పార్టీనే
Aaraa Mastan survey: ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టీ కౌంటింగ్ డే మీదే నిలిచింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం కూటమి ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్నాయి.
ఏపీలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలూ వెలువడేది అప్పుడే. ఎవరు రాజవుతాడు? ఎవరు బంటు.. అనేది తేలుతుందారోజున.

చివరి విడత లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడటం ఆరంభమైంది. సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. ఏపీలో జరిగిన 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ, తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒక్కసారిగా వెలువడటం ప్రారంభమైంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడే ఫలితాలకు ఇంచుమించుగా సరిపోయేలా ఇవి ఉండొచ్చు.
తాజాగా ఏపీపై తన ఎగ్జిట్ పోల్ అంచనాలను కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు.. ప్రముఖ సర్వే సంస్థ ఆరా అధినేత ఆరా మస్తాన్. ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారనేది తేల్చి చెప్పారు. దీనికోసం పల్నాడు జిల్లాలోని చిలుకలూరిపేట నియోజకవర్గం పరిధిలో గల మద్దిరాలలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఆరా మస్తాన్ విడుదల చేసిన సర్వే నివేదికల ప్రకారం చూసుకుంటే- ఈ ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురబోతోంది. వైఎస్ఆర్సీపీకి 94 నుంచి 105 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయి. 49.57 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయి. లోక్‌సభ నియోజకవర్గాల్లో వైసీపీ తన ఖాతాలో వేసుకునేవి 13 నుంచి 17 స్థానాలు ఉండొచ్చు.
తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి 71 నుంచి 81 అసెంబ్లీ స్థానాలు దక్కుతాయి. లోక్‌సభలో 10 నుంచి 12 సీట్లు దక్కే అవకాశం ఉంది. ఈ కూటమికి పడే ఓట్ల శాతం 47.55 శాతం వరకు ఉండొచ్చు. టీడీపీ కూటమికి పురుషుల ఓట్లు 51.56, మహిళల ఓట్లు 54.76 శాతం మేర పడ్డాయని ఆరా మస్తాన్ సర్వే తెలిపింది.












Click it and Unblock the Notifications