కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు క్లాస్ తర్వాత: వైసిపి నుంచి వచ్చిన నేతకు ఝలక్, చైర్మన్‌గా ఆసం

కడప జిల్లాలోని ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక చైర్మన్‌గా టిడిపి అభ్యర్థి ఆసం రఘురామిరెడ్డి ఎన్నికయ్యారు. ఆసంకు మద్దతుగా 31 మంది కౌన్సెలర్లు ఓటేశారు.

|
Google Oneindia TeluguNews

కడప: కడప జిల్లాలోని ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక చైర్మన్‌గా టిడిపి అభ్యర్థి ఆసం రఘురామిరెడ్డి ఎన్నికయ్యారు. ఆసంకు మద్దతుగా 31 మంది కౌన్సెలర్లు ఓటేశారు.

వైసిపి కౌన్సెలర్లు గైర్హాజరయ్యారు. ఆసం ఎన్నికైనట్లు అదికారులు ప్రకటించారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కాగా, ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక గతంలో రెండుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.

ప్రొద్దుటూర్ టిడిపిలో 'వైసిపి' ట్విస్ట్.. ఇదీ విషయం: వరదరాజులు బాబుకు షాకిస్తారా?ప్రొద్దుటూర్ టిడిపిలో 'వైసిపి' ట్విస్ట్.. ఇదీ విషయం: వరదరాజులు బాబుకు షాకిస్తారా?

టిడిపిలోనే రెండు వర్గాల మధ్య విభేదాలతో వాయిదా పడింది. ఓ వైపు వరదరాజులు రెడ్డి వర్గం ఆసం, మరోవైపు వైసిపి నుంచి టిడిపిలో చేరిన ముక్తియార్ వర్గం పోటాపోటీకి దిగాయి. దీంతో రెండుసార్లు ఇరువర్గాల మధ్య గొడవ జరిగి, ఎన్నిక వాయిదా పడింది.

Aasam Raghuram Reddy is Proddatur Municipal Chairman

నెగ్గించుకున్న వరదరాజులు రెడ్డి

ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, లింగారెడ్డి టీడీపీ నుంచి ఇద్దరూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ ఎన్నికలో వరద రాజులరెడ్డి బావమరిది ఆసం రఘురామి రెడ్డి పోటీకి దిగారు. అతనిని ఎలాగైనా గెలిపించుకోవాలని విశ్వప్రయత్నాలు చేశారు.

మరో వర్గం విషయానికి వస్తే.. ఈ వర్గం నుంచి ముక్తియార్ పోటీకి దిగారు. ముక్తియార్ ఇటీవల వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో ఇరువురి మధ్య పోటీ ఏర్పడింది. తొలుత వైసిపి నుంచి వచ్చిన ముక్తియార్ గెలిచే పరిస్థితులు కనిపించాయి.

దీంతో వరదరాజులు రెడ్డి వర్గీయులు ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఇరువర్గాలు కుర్చీలు విసురుకొని, రాద్దాంతం చేశాయి. దీనిపై సీఎం చంద్రబాబు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆగ్రహం, అంతర్గతంగా చర్చల అనంతరం వైసిపి నుంచి వచ్చిన ముక్తియార్‌ను పక్కన పెట్టి, వరదరాజులు రెడ్డి వర్గీయు ఆసంను ఈ రోజు ఎన్నుకున్నారు.

English summary
Aasam Raghuram Reddy has been unanimously elected as Chairman of Proddatur Municipality in Kadapa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X