Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టిడిపి నేత కిడ్నాప్ కలకలం: రూ.3కోట్లు డిమాండ్ చేసి 50లక్షలకు బేరం, రాజేష్ ముఠా పనే?

చిత్తూరు: జిల్లాలోని యాదమరి మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత, గ్రానైట్ వ్యాపారి భజలింగాన్ని గుర్తుతెలియని దుండగులు మంగళవారం రాత్రి కిడ్నాప్ చేశారు. భజలింగంను మంగళవారం రాత్రి కిడ్నాప్ చేసినా.. విషయం బుధవారం సాయంత్రం 3గంటల ప్రాంతంలో వెలుగులోకి రావడంతో జిల్లాలో కలకలం రేగింది. అయితే, ఆ తర్వాత పోలీసుల రంగప్రవేశంతో పలమనేరు సమీపంలోని మొగిలి ఘాట్‌లో భజలింగంను వదిలేశారు కిడ్నాపర్లు.

కాగా, పోలీసుల కథనం ప్రకారం.. యాదమరి మండలం గోందివాళ్ల గ్రామానికి చెందిన భజలింగం మంగళవారం రాత్రి తమిళనాడులోని పరదరామి నుంచి స్కార్పియో వాహనంలో ఇంటికి వస్తున్నాడు. పాచిగుంట గ్రామం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కారుతో వాహనాన్ని అడ్డగించి కళ్లలో కారం కొట్టి కిడ్నాప్ చేశారు. అనంతరం అతన్ని పలమనేరు సమీపంలోని మొగిలి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి తీవ్రంగా గాయపరిచారు.

రూ.3 కోట్లు ఇస్తే భజలింగంను వదిలేస్తామని, లేకుంటే చంపేస్తామని వారి కుమారులకు ఫోన్‌లో తెలిపారు. మంగళవారం రాత్రంతా బేరసారాలు ఆడి చివరకు రూ.50 లక్షలకు సెటిల్ చేసుకున్నారు. నగదును పలమనేరు అటవీ ప్రాంతంలోని మొగిలి ఘాట్‌లో వాహనంలో ఉంచి వెళ్లాలని చెప్పడంతో భజలింగం కుమారులు అక్కడికి వెళ్లారు.

Abducted TDP leader released after payment of ransom

భజలింగం కుమారులు గోవర్ధన్, నిత్యానందంలు డబ్బులను మొగిలిఘాట్ వద్ద కిడ్నాపర్లలో ఒకడికి ఇచ్చారని, అయినా తండ్రిని వదలకపోవడంతో నిత్యానందం ఫోన్ చేశాడని పోలీసులు చెబుతున్నారు. కాగా, కిడ్నాపర్లు పోలీసుల రాకను గమనించి భజలింగాన్ని, వాహనాన్ని వదిలేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని గంగవరం పోలీసులు చిత్తూరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భజలింగం పరిస్థితి నిలకడగానే ఉంది. ఆయణ్ని జిల్లాకు చెందిన పలువురు టిడిపి నేతలు పరామర్శించారు.

రాజేష్ ముఠా పనేనా?

కాగా, భజలింగం అపహరణలో పోలీసులు విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. భజలింగం నుంచి పలు వివరాలు సేకరించిన పోలీసులు, ఫోన్‌కాల్స్‌, ఇతర సమాచారం ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో కిడ్నాప్‌ బంగారుపాళ్యంకు చెందిన రాజేష్‌ ముఠా పనేనని నిర్థారణకు వచ్చారు.

భజలింగంను వదిలివెళ్లిన పలమనేరు గాట్‌ రోడ్డు పరిధిలో అటవీ ప్రాంతాన్ని జల్లడపట్టారు. కిడ్నాప్‌ సమాచారం వచ్చిన గంటల్లోనే హైవే మొబైల్‌ పోలీసులు, పలమనేరు, చిత్తూరు పోలీసులు సమన్వయంతో వ్యవహరించడంతో ముఠాలోని కీలకమైన ఇద్దరు నిందితులు పట్టుకున్నట్లు సమాచారం. వీరిని రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+