భిక్షమెత్తిన విద్యార్థులు
హన్మకొండ: పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలంటూ ఎబివిపి ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహిచారు. గురువారం హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్ద ఎబివిపి విద్యార్థులు వినూత్నంగా బిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్ధుల ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం సాధించినా ఇంకా విద్యార్ధులకు న్యాయం జరగటం లేదని, విద్యావ్యవస్థ అస్థవ్యస్ధమైందని ఎబివిపి నాయకులు ఆరోపించారు. తెలంగాణ వస్తే విద్యార్ధుల కష్టాలు దూరమౌతాయని అనుకున్నామని కానీ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్ షిప్ లను కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు.












Click it and Unblock the Notifications