ఏపీలో రిజిస్టార్ ఆఫీసులపై ఏసీబీ భారీ దాడులు-ఒకేసారి 120 చోట్ల..!
ఏపీలో అవినీతి కేంద్రాలుగా మారిన సబ్ రిజిస్టార్ ఆఫీసుల విషయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ప్రభుత్వం అవినీతి నిరోధానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రిజిస్టార్ కార్యాలయాల్లో మాత్రం పరిస్ధితి మారడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవాళ రాష్ట్రంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాలపై ఏసీబీ విరుచుకుపడుతోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏకంగా 120 ఆఫీసులపై ఏకకాలంలో దాడులు జరుపుతోంది.
రాష్ట్రంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అవినీతిపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) అధికారులు ఇవాళ ఈ భారీ ఆపరేషన్ చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లా ఒంగోలు, విజయనగరం జిల్లా భోగాపురం, సత్యసాయి జిల్లా చిలమత్తూరు, పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటతో పాటు పలు చోట్ల ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఆయా కార్యాలయాల్లో రికార్డుల్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు.

రాష్ట్రంలో సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో భారీ ఎత్తున లావాదేవీలు జరుగుతున్నా రికార్డుల్లోకి రావడం లేదనే ఫిర్యాదులు ఎప్పటి నుంచో ఉన్నాయి. పలు చోట్ల డబ్బు కోసం రికార్డుల్ని మార్చేస్తున్న ఘటనలపైనా ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిపై స్థానిక అధికారుల నుంచి రాష్ట్రస్దాయి వరకూ పలు చోట్ల అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఏసీబీ దాడులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు పలు చోట్ల దాడులు జరిపి కీలక డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకుంటున్నట్లు సమాచారం.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications