ఇబ్బందులు ఉన్నాయా, చంద్రబాబుతో న్యాయమూర్తి ఆరా- రిమాండ్ పొడిగింపు...!
చంద్రబాబు కు ఏసీబీ కోర్టు రెండు రోజులు రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు(Chandra Babu) ను అయిదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ(CID) పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పైన రెండు రోజుల క్రితమే విచారణ ముగిసింది. గురువారమే తీర్పు వస్తుందని అంచనా వేసినా హైకోర్టులో క్వాష్ పిటీషన్ పైన తీర్పు వెలువడే అవకాశం ఉండటంతో పెండింగ్ లో ఉంచారు. ఈ రోజు వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా న్యాయమూర్తి చంద్రబాబును విచారించారు. కాసేపట్లో కస్టడీ పిటీషన్ పైన మధ్నాహ్నం తీర్పు వెల్లడి కానుంది.
న్యాయమూర్తి విచారణ : చంద్రబాబును వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా న్యాయమూర్తి విచారించారు. జైలులో ఇబ్బందులు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎల్లుండి వరకు జ్యుడిషియల్ రిమాండ్(Remand) లోనే ఉంటారని చెప్పారు. సీఐడీ కస్టడీకి ఇవ్వాలని అడుగుతోందని..మీ తరపు న్యాయవాదులు అవసరం లేదని చెబుతున్నారని చంద్రబాబుతో పేర్కొన్నారు.

తనను అకారణంగా జైల్లో పెట్టారని న్యాయమూర్తితో చంద్రబాబు చెప్పారు. తాను దాని గురించే ఆవేదన చెందుతున్నానని పేర్కొన్నారు. తన గురించి దేశంలో అందరికీ తెలుసని వివరించారు. అన్ని విషయాలు నోట్ చేసుకున్నానని చెప్పిన న్యాయమూర్తి..చట్టం అందరికీ సమానమేనని వ్యాఖ్యానించారు. మీ పై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని..విచారణలో అన్నీ తేలుతాయన్నారు.
రిమాండ్ మాత్రమే : రిమాండ్ ను శిక్షగా భావించవద్దని పేర్కొన్నారు. జైలులో చంద్రబాబుకు అందిస్తున్న సౌకర్యాలపైన న్యాయమూర్తి నివేదిక కోరారు. జైలులో ఇబ్బందులు ఎదురైతే తనకు చెప్పాలని సూచించారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు(Chanra Babu) పాత్ర స్పష్టంగా ఉందని సీఐడీ వాదించింది. ఈ కేసులో రూ 351 కోట్ల మేర స్కాం జరిగిందని..నిబంధనలకు వ్యతిరేకంగా సొమ్ము విడుదల చేసారని పేర్కొంది.

దీనికి సంబంధించి చంద్రబాబును విచారించి పూర్తి సమాచారం సేకరించాల్సి ఉందని కోర్టు ముందు సీఐడీ (CID)వాదనలు వినిపించింది. ఇదే సమయంలో చంద్రబాబు తరపు న్యాయవాది లూధ్రా సీఐడీ వాదనలతో విభేదించారు. అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తరువాత సుదీర్ఘంగా విచారించారని.. మరోసారి కస్టడీకి అవసరం లేదని వాదించారు.
బెయిల్ ప్రయత్నాలు : అటు చంద్రబాబు క్వాష్ పిటీషన్ పైన హైకోర్టు(HighCourt)లో వాదనలు ముగిసి..తీర్పు రిజర్వ్ అయి ఉంది. ఇప్పుడు చంద్రబాబు బెయిల్ (Chandra Babu Bail)కోసం న్యాయవాదులు ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసి ఉండటంతో..విచారణ కోరే అవకాశం కనిపిస్తోంది. అటు చంద్రబాబు పైన పెండింగ్ లో ఉన్న కేసుల్లో సీఐడీ వరుసగా పీటీ వారెంట్లు దాఖలు చేసింది. వీటి పైన చంద్రబాబు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ కోసం ధరఖాస్తు చేసారు. ఇక, ఇప్పుడు రిమాండ్ పైన నిర్ణయం వెలువరించటంతో ఇక న్యాయ పరంగా ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications