సీఐడీ కస్టడీకి చంద్రబాబు, కోర్టు అనుమతి - ఉక్కిరి బిక్కిరి..!!
చంద్రబాబుకు మరో ప్రతికూల నిర్ణయం వెలువడింది. రెండు రోజుల పాటు చంద్రబాబు విచారణకు వీలుగా సీఐడీకి అనుమతిస్తూ తీర్పు వెల్లడైంది. ఈ ఉదయమే చంద్రబాబు(Chandra Babu) కు ఏసీబీ కోర్టు రెండు రోజులు రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అటు హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్ ను హైకోర్టు(High Court) డిస్మిస్ చేసింది. దీంతో, ఏసీబీ కోర్టు సీఐడీ దాఖలు చేసిన చంద్రబాబు కస్టడీ పిటీషన్(Custody Petition) పైన తీర్పు వెల్లడించింది. అటు భవిష్యత్ న్యాయ పోరాటం పైన చంద్రబాబు తరపు న్యాయవాదులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు బెయిల్ అంశం పైన ఎలాంటి అడుగులు వేస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది.
కోర్టులో సుదీర్ఘ వాదనలు : టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ కోరిన విధంగా అయిదు రోజులు కాకుండా, రెండు రోజుల సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఉదయం చంద్రబాబు(Chandra Babu)ను వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా న్యాయమూర్తి విచారించారు. జైలులో ఇబ్బందులు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎల్లుండి వరకు జ్యుడిషియల్ రిమాండ్(Remand) లోనే ఉంటారని చెప్పారు.

సీఐడీ కస్టడీకి ఇవ్వాలని అడుగుతోందని..మీ తరపు న్యాయవాదులు అవసరం లేదని చెబుతున్నారని చంద్రబాబుతో పేర్కొన్నారు. తనను అకారణంగా జైల్లో పెట్టారని న్యాయమూర్తితో చంద్రబాబు చెప్పారు. తాను దాని గురించే ఆవేదన చెందుతున్నానని పేర్కొన్నారు. తన గురించి దేశంలో అందరికీ తెలుసని వివరించారు. అన్ని విషయాలు నోట్ చేసుకున్నానని చెప్పిన న్యాయమూర్తి..చట్టం అందరికీ సమానమేనని వ్యాఖ్యానించారు.
హైకోర్టు తీర్పుతో : చంద్రబాబు పై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని..విచారణలో అన్నీ తేలుతాయన్నారు. రిమాండ్ ను శిక్షగా భావించవద్దని పేర్కొన్నారు. జైలులో చంద్రబాబు (Chandra Babu)కు అందిస్తున్న సౌకర్యాలపైన న్యాయమూర్తి నివేదిక కోరారు. జైలులో ఇబ్బందులు ఎదురైతే తనకు చెప్పాలని సూచించారు. స్కిల్ స్కాం(Skill Scam)లో చంద్రబాబు(Chanra Babu) పాత్ర స్పష్టంగా ఉందని సీఐడీ వాదించింది.
ఈ కేసులో రూ 351 కోట్ల మేర స్కాం జరిగిందని..నిబంధనలకు వ్యతిరేకంగా సొమ్ము విడుదల చేసారని పేర్కొంది. దీనికి సంబంధించి చంద్రబాబును విచారించి పూర్తి సమాచారం సేకరించాల్సి ఉందని కోర్టు ముందు సీఐడీ (CID)వాదనలు వినిపించింది. ఇదే సమయంలో చంద్రబాబు తరపు న్యాయవాది లూధ్రా సీఐడీ(Luthra) వాదనలతో విభేదించారు.

బెయిల్ కోసం ప్రయత్నాలు : చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తరువాత సుదీర్ఘంగా విచారించారని.. మరోసారి కస్టడీకి అవసరం లేదని వాదించారు. అసలు చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్(FIR) లో లేదని వాదించిన న్యాయవాదులు..నిబంధనలకు విరుద్దంగా అరెస్ట్ చేసారని వివరించారు.
రిమాండ్ రిపోర్టు(Remand Report)లో పేర్కొన్న అంశాల్లో వాస్తవాలు లేవని.. రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసులో చంద్రబాబు ప్రస్తావన చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎన్‌ఎస్‌జీ భద్రత ఉన్న వ్యక్తిని విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడమే కాకుండా కస్టడీకి కోరడమేంటని ప్రశ్నించారు. హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటీషన్ డిస్మిస్ చేయటంతో ఇప్పుడు ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించింది.












Click it and Unblock the Notifications