చంద్రబాబుకు బెయిలా, కస్టడీనా - సీఐడీ కొత్త అస్త్రం, నేడే కీలకం..!!
టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ విషయంలో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. ఏసీబీ కోర్టులో ఈ రోజు చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్ల పైన ఈ రోజు విచారణ జరగనుంది. హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ సమయంలో ఏసీబీ కోర్టులో చంద్రబాబు, సీఐడీ దాఖలు చేసిన ఈ రెండు పిటీషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ... నిర్ణయం పై ఉత్కంఠ కొనసాగుతోంది.
నేడు బెయిల్ పిటీషన్ విచారణ:స్కిల్ స్కాం కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 10వ తేదీ నుంచి రిమాండ్ లో ఉన్నారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. ఇదే సమయంలో చంద్రబాబును రిమాండ్ కు ఇవ్వాలంటూ సీఐడీ మరో పిటీషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటీషన్ల పైన బుధవారం విచారణ జరగనుంది.

మంగళవారమే ఈ రెండు పిటీషన్లపై విచారణ జరగాల్సి ఉన్నా..హైకోర్టులో క్వాష్ పిటీషన్ విచారణతో ఈ రోజుకు వాయిదా పడింది. ఈ కేసులో తనకు ఎటువంటి ప్రమేయం లేదని.. అయినా విచారణకు పూర్తిగా సహకరిస్తానని చంద్రబాబు తన బెయిల్ పిటీషన్ లో కోర్టును అభ్యర్దించారు. సీఐడీ మాత్రం చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరింది.
పీటీ వారెంట్ దాఖలు:ఈ నెల 22తో చంద్రబాబుకు విధించిన రిమాండ్ పూర్తి కానుంది. ఈ సమయంలోనే చంద్రబాబు పైన ఉన్న ఫైబర్ గ్రిడ్ కేసులో సీఐడీ తాజాగా ఏసీబీ కోర్టులో పిటీ వారెంట్ దాఖలు చేసింది. ఫైబర్ నెట్ తొలి దశ టెండర్లలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై 2021 సెప్టెంబర్ లో నమోదు చేసిన కేసులో చంద్రబాబును 25వ నిందితుడిగా ఏపీ సీఐడీ పేర్కొంది.
ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబు ను ఈ కేసులో విచారించేందుకు అనుమతివ్వాలని కోరుతూ సీఐడీ ఈ పిటీషన్ దాఖలు చేసింది. అటు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనూ ఇప్పటికే ఇదే రకమైన పీటీ వారెంట్ దాఖలు చేయటంతో..దీని పైన హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోస దరఖాస్తు చేసారు. దీని పైన హైకోర్టు ఈ నెల 22న విచారణ చేయనుంది.

కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ:ఇక, ఈ రోజు చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లు రెండూ ఏసీబీ కోర్టు ముందుకు వస్తుండటంతో రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది. చంద్రబాబు బెయిల్ కోసం దరఖాస్తు చేసిన వేళ సీఐడీ వరసుగా పిటీ వారెంట్లు దాఖలు చేయటంతో..
బెయిల్ వాదనల నేపథ్యంలో ఈ వారెంట్ల అంశం కీలకంగా మారనుంది. హైకోర్టులో క్వాష్ పిటీషన్ పైన నిర్ణయం రిజర్వ్ చేయటంతో ఇప్పుడు బెయిల్ పిటీషన్ పైన విచారణ కోర్టు ఇరు పక్షాల వాదనలు విననుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబును సీఐడీ కోరినట్లుగా కస్టడీకి అనుమతిస్తార..లేక చంద్రబాబుకు బెయిల్ దొరుకుతుందా అనేది తేలే అవకాశం కనిపిస్ోంది. దీంతో నేడు కోర్టులో జరిగే వాదనలు..నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications