ఏ-1గా మాజీ మహిళా మంత్రి, బిగిస్తున్న ఉచ్చు- రంగం సిద్దం..!!

ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైసీపీ హయాంలో అవినీతి.. అక్రమాలకు పాల్పడిన వారి పైన కేసులు నమెదు చేసి అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు జైలుకు వెళ్లారు. ఇప్పుడు మాజీ మహిళా మంత్రి కు ఉచ్చు బిగిస్తోంది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి వసూల్లకు పాల్పడ్డారనే ఫిర్యాదుల పైన ఏసీబీ కేసు నమోదు చేసింది. మాజీ మంత్రితో పాటుగా ఐపీఎస్ అధికారి పైనా విచారణకు రంగం సిద్దమైంది. దీంతో, ఈ మాజీ మహిళా మంత్రి వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

మాజీ మంత్రి పై కేసు
మాజీ మంత్రి విడదల రజనీ పై ఏసీబీ కేసు నమోదైంది. మంత్రిగా ఉన్న సమయంలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌ యజమాన్యాన్ని విజిలెన్స్‌ తనిఖీల ముసుగులో బెదిరించి వారి నుంచి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై రజనీ పైన ఏసీబీ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని 7, 7ఏ, ఐపీసీలోని 384, 120బీ సెక్షన్లు వర్తింపజేస్తూ కేసు నమోదు చేసారు. ఈ కేసులో ఏ1గా విడదల రజిని, ఏ2గా ఐపీఎస్‌ అధికారి పల్లె జాషువా, ఏ3గా విడదల రజిని మరిది విడదల గోపి, ఏ4గా రజిని పీఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చారు.

acb-files-case-on-vidadala-rajini-in-stone-crusher-complaint-along-with-one-ips-officer

రజనీ పేరుతో బెదిరింపులు
రజనీ తో పాటుగా జాషువా మరి కొందరు బెదిరింపులు, అక్రమ వసూళ్లపై తొలుత విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు అందింది. దీని పైన విచారణ చేసిన అధికారులు ప్రభుత్వానికి నివే దిక సమర్పించారు. విజిలెన్స్ సిఫార్సు మేరకు సర్కార్ ఏసీబీ విచారణకు ఆదేశించింది. ప్రాధమి క ఆధారాలు లభించడంతో తాజా కేసు నమోదు చేశారు. కండ్రిక గ్రామంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్‌ క్రషర్‌ను అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పీఏ దొడ్డ రామకృష్ణ సందర్శించారు. తన నియోజకవర్గ పరిధిలో వ్యాపారం నడవాలంటే అడిగినంత డబ్బులివ్వాల్సిందేనని, మిగతా విషయాలు తన పీఏ రామకృష్ణతో మాట్లాడాలని రజిని వారితో చెప్పినట్లు ఫిర్యాదు చేసారు.

కీలక ఆధారాలు
ఆ స్టోన్‌ క్రషర్‌పై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే విజిలెన్స్ లో కీలకంగా వ్యవహరించిన జాషువా విచారణకు వెళ్లారు. అప్పటి విజిలెన్స్‌ డీజీ అనుమతి కూడా తీసుకోలేదు. అప్పట్లో ఈ సోదాల్లో పాల్గొన్న మిగతా అధికారులను ఏసీబీ విచారించగా జాషువా ఆదేశాలతోనే తామంతా తనిఖీల్లో పాల్గొన్నామని ఆ తర్వాత విచారణ ఏమైందో కూడా తెలియదని వాంగ్మూలాలిచ్చారు. తర్వాత జాషువా దాని యజమానులకు ఫోన్‌ చేశారు. వెంటనే విడదల రజినిని కలవాలని లేకపోతే రూ.50 కోట్లు జరిమానా విధించడంతో పాటు క్రషర్‌ను మూయించేస్తానని బెదిరించారు. దీంతో, వారు రూ.2 కోట్లు ఇచ్చారు. ఇక, ఇప్పుడు ప్రాధమికంగా ఆధారాలు ఉండటంతో.. ఈ కేసులో రజనీ తో పాటుగా మిగిలిన వారిని విచారించేందుకు రంగం సిద్దమైంది. ఏసీబీ తీసుకునే చర్యల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+