జగన్ హయాంలో రూ. వేల కోట్ల ఇసుక స్కామ్, ఏసీబీ దెబ్బతో మైండ్ బ్లాక్, జంప్

జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన ఇసుక విధానంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వేలాది కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఏసీబీ అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ. వెంకటరెడ్డి ఈ స్కామ్ కింగ్ పిన్ అని ఏసీబీ అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఇసుక కాంట్రాక్టు సంస్థలు అయిన జీపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమా సంస్థలతో పాటు మరికొందరు వ్యక్తులతో కలిసి వెంకటరెడ్డి ఇసుక స్కామ్ కు తెరలేపారని వెలుగు చూసింది.

గత వైసీపీ ప్రభుత్వంలో వేలకోట్ల రూపాయల ఇసుకను కొట్టేశారని, వెంకటరెడ్డి పక్కాప్లాన్ ప్రకారమే ఈ వ్యవవహారం నడిపించారని ఏసీబీ అధికారుల విచారణలో వెలుగు చూసింది. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి పలు ఇసుక కాంట్రాక్టు సంస్థలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుమారు రూ.2,566 కోట్ల రూపాయల నష్టం కలిగేలా వ్యవహరించారని ఏసీబీ విచారణలో వెలుగు చూసింది. దీంతో వీజీ వెంకటరెడ్డి పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

ACB has registered a case that more than two thousand crores of sand scam took place in Jagan s government

ఈ కేసులో జీపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమా సంస్థల ప్రతినిధులను నిందితులుగా చేర్చిన ఏసీబీ అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో తప్పించుకుని తిరుగుతున్న గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. ఏపీఎండీసీ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి అత్తగారిల్లు అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో పట్టణంలో ఉంది. గురువారం రాయచోటి వెళ్లిన ఏసీబీ అధికారులు ఏపీఎండీసీ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి బంధువుల ఇళ్లల్లో అధికారుల సోదాలు చేసి పలు పత్రాలు పరిశీలించి వాటిలో కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.

జగన్ ప్రభుత్వంలో వెంకటరెడ్డి చేతివాటం చూపించారని వెలుగు చూసింది. జగన్ ప్రభుత్వం 2021లో ఇసుక విధానం తీసుకువచ్చింది. ప్రభుత్వ, గనుల శాఖ నియమాలు పక్కనపెట్టిన వెంకటరెడ్డి ఆయనకు కావాల్సిన సంస్థలకి లాభం చేకూర్చేలా వ్యవహరించారని ఏసీబీ అధికారుల విచారణలో వెలుగు చూసింది. గనుల శాఖ నియమాలు పూర్తిగా పక్కన పెట్టిన వెంకటరెడ్డి జీపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమా ఇన్ఫ్రా తదితర సంస్థలకు లాభం చేకూర్చేలా వ్యవహరించారని ఏసీబీ అధికారులు అంటున్నారు.

ఇసుక టెండర్ల ఖరారు ఒప్పందాలను వెంకటరెడ్డి పూర్తిగా ఉల్లంఘించారని ఏసీబీ అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది జీపీవీఎల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుమారు రూ. 800 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నప్పటికీ ఆ సంస్థకు ఎన్ఓసి ఇచ్చేశారని, బ్యాంకు గ్యారెంటీగా ఉన్న రూ. 120 కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీని వెనక్కి తీసుకోవడానికి వెంకట్ రెడ్డి ఆ సంస్థక ఎన్ఓసీ ఇచ్చారని ఏసీబీ అధికారులు అంటున్నారు.

ACB has registered a case that more than two thousand crores of sand scam took place in Jagan s government

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 800 కోట్ల బకాయిలు ఉన్న జీపీవీఎల్ సంస్థకు మాజీ గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఏ ప్రతిపాదికన ఎన్ఓసీ ఇచ్చారో అర్థం కావడం లేదని ఏసీబీ అధికారులు అంటున్నారు.
ఇప్పటికే తప్పించి తిరుగుతున్న వెంకటరెడ్డి చిక్కితే గాని ఈ ఇసుక స్కామ్ వ్యవహారం ఓ కొలిక్కి రాదని ఏసీబీ అధికారులు అంటున్నారు. జగన్ ప్రభుత్వంలో గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి రూ. 2,566 కోట్ల స్కామ్ కు తెర లేపారని వెలుగు చూడడం ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతోంది.

ఇప్పటికే నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వేల కోట్ల రూపాయల ఇసుక స్కామ్ జరిగిందని తెలుసుకున్న ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కాంలో చాలా మంది వైసీపీ నాయకులు హస్తం కూడా ఉందని, పూర్తి వివరాలు బయటకు లాగుతున్నామని కూటమి ప్రభుత్వంలోని ఓ నాయకుడు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+