చిట్టా లాగుతున్నారు: ఏసీబీకి మరో అవినీతి తిమింగలం చిక్కినట్లేనా?, ఏక కాలంలో 18 చోట్ల..

విజయవాడ: ఏసీబీ వలలో మరో భారీ అవినీతి తిమింగలం చిక్కినట్లే కనిపిస్తోంది. ఏపీ దేవాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ శీలం సూర్య చంద్రశేఖర్ ఆజాద్ ఇంట్లో ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

మంగళవారం తెల్లవారుజాము నుంచే ఆయన ఇంటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అధికారులు సోదాలు చేపట్టారు.

బంధువుల ఇళ్లలోను:

బంధువుల ఇళ్లలోను:

ప్రస్తుతం రాజమహేంద్రవరంలో పనిచేస్తున్న చంద్రశేఖర్ ఆజాద్ కు పలు చోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. రాజమహేంద్రవరంతో పాటు విజయవాడ, ఏలూరు, నూజివీడు, హైదరాబాద్, అనంతపురంలలోని బంధువుల, స్నేహితుల ఇళ్లపై కూడా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. సాయంత్రానికల్లా అక్రమాస్తుల వివరాలు బయటకొచ్చే అవకాశముంది.

 ఏక కాలంలో 18 చోట్ల

ఏక కాలంలో 18 చోట్ల

తెలుగు రాష్ట్రాల్లో 18 చోట్ల, 21 బృందాలతో ఏసీబీ అధికారులు ఏక కాలంలో తనిఖీలు చేస్తున్నారు. కాకినాడ కేంద్రంగా ఉన్న ఆర్‌జేసీ కార్యాలయాన్ని చంద్రశేఖర్ ఆజాద్ తనకు అనుకూలంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు.

 బినామీ పేర్లతో:

బినామీ పేర్లతో:

ఏలూరు పత్తేబాద్‌ సమీపంలో 6 ఎకరాల విలువైన స్థలాన్ని చంద్రశేఖర్ ఆజాద్ బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అలాగే విజయవాడ పడమట సమీపంలోని విద్యుత్‌ కోట్లు విలువ చేసే ఐదు అంతస్తుల భవనాన్ని గుర్తించారు. ఇది కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నట్లు తెలుస్తోంది.

అక్కడ ఆస్తులు:

అక్కడ ఆస్తులు:

గొల్లపూడిలో అత్యాధునిక హంగులతో ఓ ఇంటిని నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ దాదాపు రూ.1.50కోట్ల పైచిలుకే అని భావిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్దంగా ఉన్న ఈ ఇంటి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

అనంతపురం జిల్లా కదిరిలోను 32ఎకరాల్లో అబేధ్య సోలార్ పవర్ ప్లాంట్ ఉన్నట్లు గుర్తించారు. దీనిపై రూ.15కోట్ల రుణం తీసుకున్నట్లు, ఇది ఆజాద్ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నట్లు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+