అన్ని ఆస్తులా?: అధికారుల మైండ్ బ్లాంక్.. టౌన్ ప్లానింగ్ అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు

విజయవాడలో జూనియర్ టెక్నికల్ ఇంజనీర్‌గా పని చేస్తున్ననల్లూరి వెంకట శివప్రసాద్ నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రఘు పోగేసిన ఆస్తులు, ఇంట్లో ఉన్న బంగారం, నగదు చూసి అధికారులే షాక్ తిన్నారు.ఏపీ కం

విజయవాడ: ఏపీ కంప్ట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్నతాధికారిగా పని చేస్తున్న రఘుపై అవినీతి ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు ఆయన నివాసంపై దాడి చేశారు.

విశాఖ, విజయవాడల్లోని ఆయన నివాసాలతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లపై దాడులు చేశారు. దీంతో రఘుకు బినామీలు ఉన్నట్లు తేలింది. అందులో టౌన్ ప్లానింగ్ సూపరిండెంట్ శివప్రసాద్ పేరు కూడా బయటపడింది. వీరిద్దరి మధ్య బంధుత్వం ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఆయన నివాసంపై కూడా దాడులు నిర్వహించారు.

acb raids on junior technical engineer raghu's houses

శివప్రసాద్ ఇంట్లో ఉన్న బంగారం, నగదు చూసి అధికారులే షాక్ తిన్నారు.
విజయవాడలోని ఆయన నివాసంలో.. మాసిన బట్టలు, వాషింగ్ మెషీన్ కింద, మంచంకింద, బీరువా సొరుగుల్లో ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా బంగారం దొరకడం చూసి అధికారుల మైండ్ బ్లాంక్ అయింది. 70వారాల నగలు పట్టుబడటంతో.. ఇంత భారీ స్థాయిలో బంగారం ఎలా వచ్చిందని అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇక వెండి వస్తువులు, దిమ్మలు, బిస్కెట్ల రూపంలో మరో 50కేజీల వెండి లభించడం గమనార్హం. రూ.10లక్షల నగదు కూడా పట్టుబడింది. గన్నవరం సమీపంలో 300 ఎకరాల వెంచర్ కు సంబంధించిన పత్రాలు కూడా దొరికినట్లు తెలుస్తోంది. గన్నవరంలో ప్రస్తుతం ఆయన ఉంటున్న నివాసానికి సమీపంలోనే 40సెంట్ల భూమి ఉన్నట్లు గుర్తించారు.

ఇక రఘు పేరిట షిర్డీలో ఒక లాడ్జి, వేల్పూరులో రెండెకరాల వ్యవసాయ భూమి, విజయవాడలో 16 ఫ్లాట్లు, చిత్తూరు జిల్లా రాంపల్లిలో ఆస్తులు, విశాఖ, నెల్లూరుల్లోను పలు ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. డబ్బులు లెక్కించే మనీ కౌంటింగ్ మెషీన్ కూడా ఆయన నివాసంలోనే పట్టుబడటం విశేషం. రఘు అత్తమ్మ కళావతమ్మ ఇంట్లోను అధికారులు సోదాలు చేస్తున్నారు.

రఘు భార్య, అత్త పేర్లతో రెండేసి ఇళ్లు విశాఖ, విజయవాడల్లో ఉన్నట్లు ఏసీ అధికారులు గుర్తించారు. షిర్డీలోనూ రఘు అత్త పేరిట భారీగా ఆస్తులున్నాయని తెలిపారు. 2009 నుంచి కొన్ని ఆస్తులపై దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి ఆస్తులు లెక్క లేలడానికి సమయం పడుతుందని ఏసీబీ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+