విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పథకం ప్రకారం వల వేసి అవినీతి అధికారిని పట్టుకున్నారు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఓ రహదారి విషయమై ఒక కాంట్రాక్టర్‌కు బిల్లు మంజూరు చేసేందుకు అతని నుంచి రూ. 42వేలు లంచం తీసుకుంటూ విశాఖపట్నం జిల్లా వి. మాడుగులకు చెందిన మండల ఇంజనీరింగ్ అధికారి సి.హెచ్ అంబేద్కర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

వివరాల్లోకి వెళితే మండలంలోని ముకుందాపురం నుంచి బంగారుమెట్ట వరకూ నిర్మిస్తోన్న తారురోడ్డుకు సంబంధించిన ఆఖరి బిల్లును మంజూరు చేయాల్సిందిగా పోలినాయుడు వి. మాడుగుల మండల ఇంజనీరింగ్ అధికారి అంబేద్కర్‌ను కోరారు.

ఆ బిల్లు మంజూరు కావాలంటే లంచం ఇవ్వాల్సిందిగా అంబేద్కర్ డిమాండ్ చేశాడు. ఆ సొమ్ములు చెల్లించడానికి ఇష్టపడని పోలినాయుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఇంజనీరింగ్ అధికారి అంబేద్కర్‍‌ను పట్టుకునేందుకు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు వలపన్నారు.

వారి సూచనల మేరకు ఎన్ఏడీ కూడలిలో అడిగిన డబ్బు మొత్తాన్ని ఇస్తానని అక్కడకు రావాల్సిందిగా అంబేద్కర్‌ను కాంట్రాక్టర్‌ పోలినాయుడు కోరారు. వీరిద్దరూ ఎన్ఏడీ కూడలిలోని పెట్రోల్ బంకు వద్ద కలుసుకున్నారు.

పోలినాయుడు తన వెంట తీసుకొచ్చిన రూ. 42 వేలను ఇంజనీరింగ్ అధికారి అంబేద్కర్‌కు ఇస్తుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బును స్వాధీనం చేసుకుని అధికారి అంబేద్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పథకం ప్రకారం వల వేసి అవినీతి అధికారిని పట్టుకున్నారు

ఓ రహదారి విషయమై ఒక కాంట్రాక్టర్‌కు బిల్లు మంజూరు చేసేందుకు అతని నుంచి రూ. 42వేలు లంచం తీసుకుంటూ విశాఖపట్నం జిల్లా వి. మాడుగులకు చెందిన మండల ఇంజనీరింగ్ అధికారి సి.హెచ్ అంబేద్కర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

పథకం ప్రకారం వల వేసి అవినీతి అధికారిని పట్టుకున్నారు

పథకం ప్రకారం వల వేసి అవినీతి అధికారిని పట్టుకున్నారు

వివరాల్లోకి వెళితే మండలంలోని ముకుందాపురం నుంచి బంగారుమెట్ట వరకూ నిర్మిస్తోన్న తారురోడ్డుకు సంబంధించిన ఆఖరి బిల్లును మంజూరు చేయాల్సిందిగా పోలినాయుడు వి. మాడుగుల మండల ఇంజనీరింగ్ అధికారి అంబేద్కర్‌ను కోరారు.

పథకం ప్రకారం వల వేసి అవినీతి అధికారిని పట్టుకున్నారు

పథకం ప్రకారం వల వేసి అవినీతి అధికారిని పట్టుకున్నారు

ఆ బిల్లు మంజూరు కావాలంటే లంచం ఇవ్వాల్సిందిగా అంబేద్కర్ డిమాండ్ చేశాడు. ఆ సొమ్ములు చెల్లించడానికి ఇష్టపడని పోలినాయుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఇంజనీరింగ్ అధికారి అంబేద్కర్‍‌ను పట్టుకునేందుకు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు వలపన్నారు.

పథకం ప్రకారం వల వేసి అవినీతి అధికారిని పట్టుకున్నారు

పథకం ప్రకారం వల వేసి అవినీతి అధికారిని పట్టుకున్నారు

వారి సూచనల మేరకు ఎన్ఏడీ కూడలిలో అడిగిన డబ్బు మొత్తాన్ని ఇస్తానని అక్కడకు రావాల్సిందిగా అంబేద్కర్‌ను కాంట్రాక్టర్‌ పోలినాయుడు కోరారు. వీరిద్దరూ ఎన్ఏడీ కూడలిలోని పెట్రోల్ బంకు వద్ద కలుసుకున్నారు.

పథకం ప్రకారం వల వేసి అవినీతి అధికారిని పట్టుకున్నారు

పథకం ప్రకారం వల వేసి అవినీతి అధికారిని పట్టుకున్నారు

పోలినాయుడు తన వెంట తీసుకొచ్చిన రూ. 42 వేలను ఇంజనీరింగ్ అధికారి అంబేద్కర్‌కు ఇస్తుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బును స్వాధీనం చేసుకుని అధికారి అంబేద్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

English summary
ACB Raids on visakhapatnam madugula enjaneer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X