వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చూస్తే కళ్లు చెదిరిపోతాయ్!...విశాఖ వుడా అధికారి అక్రమార్జన...ఎసిబి దాడితో వెలుగులోకి...

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: కళ్లు చెదిరే బంగారు,వెండి,ప్లాటినం,వజ్రాభరణాలు...కట్టల కట్టలుగా బ్యాంకు ఖాతాల పాసుబుక్కులు...ఇంటినిండా విలువైన లగ్జరీ వస్తువులు...బీరువాల నిండా కుక్కిన ఖరీదైన పట్టుచీరలు...భారీగా భూములు...బినామీల పేరుతో ఆస్తులు...ఏ అల్మరా తీసినా బైటపడుతున్న ఆ అవినీతి సొమ్ములు చూసి...రోజూ అక్రమార్కుల పని పట్టే ఎసిబి అధికారులే అవాక్కయ్యారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు...ఇదీ కరప్షన్ కింగ్ గా అవతరించిన విశాఖ వుడా ప్రణాళికాధికారి పసుపర్తి ప్రదీప్‌కుమార్‌ కలెక్షన్ టాలెంట్...

విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ అదనపు ముఖ్య నగర ప్రణాళికాధికారి పసుపర్తి ప్రదీప్‌కుమార్‌ కర్నూలు జిల్లా...రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడో పని చేసిన ఆయన మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని 6వ జోన్‌ కార్యాలయంలో గతంలో రెండేళ్లే పని చేశారు...అయితే ఆయన భారీగా ఆస్తులను కూడబెట్టింది కూడా ఆ రెండేళ్ల కాలంలో విశాఖ నగర పరిధిలో పనిచేసినప్పుడేనని చెబుతున్నారు.

 ముక్కుపిండి మరీ...ముడుపుల వసూలు

ముక్కుపిండి మరీ...ముడుపుల వసూలు

పట్టణ ప్రణాళిక విభాగంలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన వివిధ అనుమతుల మంజూరు కోసం ముడుపులు తీసుకున్నట్టు తమ దర్యాప్తులో తేలిందని అనిశా అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా అక్రమ భవనాల అనుమతుల విషయంలో ముక్కుపిండి మరీ వసూలు చేసేవారని తెలిసిందన్నారు. ఈయన అదృష్టం కొద్దీ ప్రవీణ్ కుమార్ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన ప్రాంతాలన్నీ అప్పటికి అభివృద్ధి దిశలో ఎదుగుతున్నవే కావడంతో పట్టణ ప్రణాళిక విభాగానికి చేతినిండా పని ఉండేది. ఇదే అదనుగా ఈయన భారీ ఎత్తున అక్రమాలకు తెర తీసినట్టు తెలుస్తోంది. పైగా ఈయన ఇటీవలే ఎసిబికి చిక్కిన మరో కలెక్షన్ కింగ్ విశాఖ టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ గొల్ల వెంకట రఘు దగ్గర ప్రదీప్‌కుమార్‌ దగ్గర గతంలో పని చేయడం గమనార్హం.

 సమాచారం తెలిసి...రహస్యంగా శోధించి..

సమాచారం తెలిసి...రహస్యంగా శోధించి..

నిజానికి ప్రదీప్‌కుమార్‌ అక్రమార్జనపై బహిరంగంగా ఎవరూ ఎలాంటి ఫిర్యాదులూ చేయలేదు. అయితే ఇటీవలే పట్టణ ప్రణాళిక, టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ ఉన్నతాధికారుల భరతం పట్టిన ఎసిబికి...ఎలాగో...ఈ ప్రదీప్‌కుమార్‌ అక్రమార్జన గురించి తెలిసింది. దీంతో ఆయనపై ప్రత్యేకంగా కొంతకాలం నుంచి నిఘా వేసి ఆయన ఎక్కడెక్కడ ఎంతెంత సంపాదించాడో వివరాలు సేకరించింది. అంతే...సోమవారం ఉదయం ఒకేసారి 12 చోట్ల దాడులు నిర్వహించింది. దీంతో ఆయన అవినీతి బండారం బైటపడటంతో పాటు అక్రమాస్తుల భండాగారం బద్దలైంది.

 నివాసంలో చూస్తే...ఆస్తులే ఆస్తులు

నివాసంలో చూస్తే...ఆస్తులే ఆస్తులు

పసుపర్తి ప్రదీప్‌కుమార్‌ వుడా అదనపు ముఖ్య నగర ప్రణాళిక అధికారిగా జనవరి నెల మొదటివారంలోనే విశాఖలో బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని వాల్తేరు క్లబ్‌ ఎదురుగా ఉన్న మార్గంలో నటరాజ్‌ టవర్స్‌లో ఈయన కుటుంబం నివాసం ఉంటోంది. ఈయన చాలా తెలివిగా తన అక్రమార్జనలో అత్యధిక భాగం బినామీలు, బంధువులు, స్నేహితుల పేరుతోనే ఉంచినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. ఇంకా రహస్యంగా దాచివుంచిన నగదు, ఆభరణాల కోసం ఆరా తీస్తున్నారు. ఈయనకు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తులేవీ లేకపోయినా...బిల్డింగు ఇన్‌స్పెక్టర్‌ స్థాయి నుంచి అదనపు సంయుక్త సంచాలకుల స్థాయి వరకు ఎదిగే ప్రస్థానంలోనే కోట్లాది రూపాయలు ఆర్జించారని తెలిసాక, ఆ అక్రమార్జన వివరాలు చూశాక ఎసిబి అధికారులే ఆశ్చర్యపోయారట.

 ఇంట్లో ఉన్న...అవినీతి సొమ్మే...

ఇంట్లో ఉన్న...అవినీతి సొమ్మే...

ఇప్పటివరకు వెలుగుచూసిన ప్రదీప్ కుమార్ అక్రమార్జన విలువ బహిరంగ మార్కెట్‌ ప్రకారం సుమారు రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ప్రదీప్‌ కుటుంబం తరుచూ విదేశాలకు వెళ్తుంటుందని తెలిసిన క్రమంలో అక్కడ ఏమైనా దాచారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఆయన విశాఖ నివాసంలో ఎసిబి సిబ్బంది సొరుగులు తీస్తుంటే బంగారు ఆభరణాలు, వజ్రాల నక్లెస్‌, ప్లాటినం చేతి ఉంగరాలు, బంగారు గొలుసులు, అలంకరణ సామగ్రి, ఖరీదైన పట్టుచీరలు, ఇతర దస్తులు బైటపడుతూనే ఉన్నాయి. దీంతో కుటుంబ సభ్యుల పేరిట ఉన్న పాస్‌పోర్టులు...ఇతర పత్రాలను ఎసిబి అధికారులు వెంటనే స్వాధీనం చేసుకున్నారు.

 తొలుత ససేమిరా...ఆ తరువాతే గుట్టు బైటపెట్టారు...

తొలుత ససేమిరా...ఆ తరువాతే గుట్టు బైటపెట్టారు...

అయితే తన ఆక్రమాస్తుల చిట్టా విప్పడానికి తొలుత ప్రదీప్‌కుమార్‌ ససేమిరా అన్నారు. అయితే ఎసిబి అధికారులు తమదైన శైలిలో గుట్టు విప్పించేసరికి చాలా వివరాలు వెలుగుచూశాయి. హైదరాబాద్‌లోని ఫ్లాటు కొనుగోలుకు వివిధ సందర్భాల్లో సుమారు రూ. 48 లక్షలు కేవలం అడ్వాన్సు చెల్లించిన దస్త్రాలతో సహా బినామీల పేరుతో ప్రదీప్‌కుమార్‌ దాచిన సంగతి కూడా ఎసిబి అధికారులు గుర్తించారు. భార్య, మామ, చిన్నాన్న, తండ్రి, బావమరిది పేర్లతో ఆస్తులున్నట్టు చెబుతున్నారు. 9.20 ఎకరాల వ్యవసాయ భూములు ఈయన భార్య లత పేరుతో ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రదీప్‌కుమార్‌ తన భార్య తరఫు స్నేహితుల పేరిట సైతం కొన్ని ఆస్తులు కొన్నట్లు ఎసిబి అనుమానిస్తోంది. ప్రదీప్‌కుమార్‌ ప్రస్తుతం వినియోగిస్తున్న ఏపీ31డీకే 123 మారుతీ బ్రెజ్జా కారు శివాజీపాలేనికి చెందిన సింహాద్రి అనే బినామీ వ్యక్తి పేరిట ఉండడం గమనార్హం. గతంలో కూడా మరో వాహనం ఇతని పేరిటే కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇంకా మధురవాడలో ఉన్న ఆస్తుల పూర్వాపరాలపై ఆరా తీస్తున్నారు.

కోహినూర్‌ బ్రాంచిలో...కేజీ బంగారం...మరి ఆ లాకర్లలో?...

కోహినూర్‌ బ్రాంచిలో...కేజీ బంగారం...మరి ఆ లాకర్లలో?...

విశాఖపట్టణం సాగర తీరంలో ఉన్నఎస్ బిఐ కోహినూర్‌ బ్రాంచి లాకరులో ప్రదీప్ కుమార్ కిలో బంగారం దాచి ఉంచినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. ఇంట్లో గుర్తించిన మరో మూడు లాకర్లపై స్పష్టత రావాలంటే ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ప్రదీప్‌కుమార్‌ భార్య అక్కడి నుంచి రావాల్సి ఉంది. ఈ లాకర్లలో ఉన్నది బంగారమా?..విలువైన పత్రాలా..?...ఏమిటనేవి తేలాల్సి ఉంది. అలాగే దేవుడి గదిలో కూడా విలువైన వెండి సామగ్రి, వంట గదిలో భారీ ఫ్రిజ్‌...అలంకరణలకు రకరకాల చేతి గడియారాలు.. హారాలు చూసి ఎసిబి సిబ్బంది మళ్లీ మళ్లీ అవాక్కవుతూనే ఉన్నారు. ఇక ప్రదీప్ కుమార్ పిల్లల చదువుకు, పెద్ద కొడుకు పెళ్లికి దాదాపు రూ. కోటిన్నర పైగానే ఖర్చు చేసినట్లు చెప్పుకుంటున్నారు...సో...
ఇవండీ కరప్షన్ కింగ్ ప్రదీప్ కుమార్ అవినీతి సామ్రాజ్యం తాలూకు వివరాలు....

English summary
VISAKHAPATNAM: Sleuths ACB Monday morning raided houses and properties of Visakhapatnam Urban Development Authority additional chief urban planner Pasuparthi Pradeepkumar, and seized valuable properties and documents during the raids, which are estimated to have a value of several crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X