కోట్లకు పడగలెత్తిన జెడ్పీ సీఈవో ఆస్తులపై ఏసీబీ దాడులు
నెల్లూరు జిల్లా పరిషత్తు సీఈవో బొబ్బా రామిరెడ్డి ఆస్తులపై శుక్రవారం దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు రూ.2 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు.
నెల్లూరు: జిల్లా జెడ్పీ సీఈవో బొబ్బా రామిరెడ్డి ఆస్తులపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. విజయవాడ, హైదరాబాద్, నెల్లూరు, గుంటూరు జిల్లాలతోపాటు మరో నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
ఇప్పటి వరకు రూ.2 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు. రామిరెడ్డికి గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో 10కి పైగా ప్లాట్లు, తిరుపతిలో జీప్లస్ ఇళ్లు ఉన్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలియజేశారు.

జెడ్పీ సీఈవో బొబ్బా రామిరెడ్డి భారీగా అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు పక్కా ఆధారాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో.. ఏకకాలంలో.. 14 చోట్ల అధికారులు దాడులు చేశారు.
హైదరాబాద్ వివేకానంద నగర్ లో ఏసీబీ ఇన్ స్పెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications