వోల్వో ప్రమాదం: కెమికల్స్ వొట్టిదే, కల్వర్ట్ పైపు వల్లే

హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల జరగిన జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాద ఘటనపై విచారణ మంగళవారం పూర్తయింది. బస్సులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని క్లూస్ టీమ్ ధ్రువీకరించింది. బస్సు అదుపు తప్పి కల్వర్ట్ను ఢీకొనటం వల్లే మంటలు చెలరేగినట్లు బృంద సభ్యులు మంగళవారమిక్కడ తెలిపారు.

జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు కల్వర్టును ఢీకొట్టి 45 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. గతనెల 30వన కొత్తకోట మండలం పాలెం గ్రామ శివారు ప్రాంతంలో ప్రమాదం జరిగిన నాటినుంచి పోలీసులు మంగళవారం వరకూ ఆధారాలను సేకరించారు. దర్యాప్తు చేసిన అంశాల ఆధారంగా క్లూస్ టీమ్ మహబూబ్‌నగర్ ఎస్పీకి ఓ నివేదికను సమర్పించారు.

no chemicals in Volvo bus

బస్సు వేగంగా కల్వర్టును ఢీకొట్టిందని, కల్వర్టు పైపు డీజిల్ ట్యాంక్‌లోకి చొచ్చుకుపోవడం వల్ల మంటలు చెలరేగాయని క్లూస్ టీమ్ తన నివేదికలో తెలిపింది. మంటలు లగేజీ విభాగానికి తాకడంతో ప్రమాదం తీవ్రతను సరిగా అంచనా వేయలేకపోయారని చెప్పారు. బస్సులో రసాయనాలు గానీ, పేలుడు పదార్థాలు గానీ లేవని క్లూస్ టీమ్ తేల్చింది.

కాగా, ఇప్పటి వరకు బస్సు ప్రమాదంలో మరణించినవారి 34 మందిని గుర్తించారు. గుర్తు పట్టలేకుండా కాలిపోవడంతో డిఎన్ఎ పరీక్షలు నిర్వహించి, మృతులను గుర్తిస్తున్నారు. బస్సులో రసాయనాలు ఉండి ఉండవచ్చునని మంగళవారంనాడు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను క్లూస్ టీమ్ కొట్టిపారేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+