ఘోర ప్రమాదం: చిన్నారితోపాటు ఐదుగురు మహిళల మృతి
జిల్లాలోని దెందులూరు మండలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొవ్వలి గ్రామం వద్ద ఓ కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
పశ్చిమగోదావరి: జిల్లాలోని దెందులూరు మండలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొవ్వలి గ్రామం వద్ద ఓ కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
మృతుల్లో రెండేళ్ల చిన్నారి సహా ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతులు కృష్ణా జిల్లా మల్లవల్లికి చెందినవారు. మృతులను చిన్నాల లక్ష్మీ(61), కుమారి(50), సౌమ్యశ్రీ(2), సులోచన(60), విజయ(50), దేవి(23)గా గుర్తించారు.

కొవ్వలిలో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications