India TV-CNX Opinion Poll: ఏపీలో ఆ పార్టీదే విజయం..!
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి దేశ్ వ్యాప్తంగా ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే నిర్వహించింది. ఈ ఒపీనియన్ పోల్ ను మార్చి 1 నుంచి 30 వరకు నిర్వహించారు. ఏపీకి సంబంధించి ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ అనూహ్య అంచనాలు వెల్లడించింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కూటమి 15 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. టీడీపీ 12, బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.
వైసీపీ 10 చోట్ల విజయం సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ 22 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 3 సీట్లు గెలుచుకుంది. కానీ ఇప్పుడు కూటమి ఎక్కువ స్థానాలు గెలుస్తుందని ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే బీజేపీ అత్యధిక స్థానాలు గెలుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీకి భారీగా సీట్లు వస్తాయని తెలిపింది.

యూపీలో బీజేపీ 73 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. మహారాష్ట్రలో బీజేపీకి 27 సీట్లు వస్తాయని అంచనా వేసింది. రాజస్థాన్ లో 25 స్థానాలకు గానూ.. 25 చోట్ల కమలమే గెలుస్తుందని సర్వే తేలినట్లు చెప్పింది. కర్ణాటకలో కూడా బీజేపీ హవా కొనసాగుతోన్నట్లు సర్వే బట్టి తెలుస్తోంది. కర్ణాటకలో బీజేపీ 22 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
మొత్తంగా ఎన్డీఏ కూటమికి 399 సీట్లు, ఇండియా కూటమికి 94 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. ఇక తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ 9 స్థానాల్లో, బీజేపీ 5, బీఆర్ఎస్ 2, ఎంఐఎం ఒక చోట విజయం సాధిస్తుందని ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది.












Click it and Unblock the Notifications