బాలీవుడ్ నటి కాదాంబరీ జెత్వానీ కేసులో ట్వీస్ట్, పరుగో పరుగు

బాలీవుడ్ నటి కదాంబరీ జెత్వానీ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీ కేసులో తనను అరెస్టు చేస్తారనే భయంతో లాయర్ వెంకటేశ్వర్లు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. బాలీవుడ్ నటి కేసులో హైకోర్టు లాయర్ ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

నటి కాదాంబరీ జెత్వానీ కేసులో వైసీపీ నాయకుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చేరింది. ముబాయి నటి కాదంబరీ జెత్వానీ ఫిర్యాదు చేయడంతో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలని ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీని వేధింపులకు గురి చేశారని నమోదు అయిన కేసులో ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గన్నీ, క్రాంతి రాణాలను సస్పెండ్ చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

Accused in Bollywood actress Kadambari Jethwani case went to court seeking bail

వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఒత్తిడితోనే పోలీసు అధికారులు తన మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని, తనతోపాటు తన తల్లిదండ్రులను అరెస్టు చేసి జైల్లో పెట్టారని, మమ్మల్ని చిత్రహింసలకు గురి చేశారని బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ తదితరులు అని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ తదితరులు అని ఉండటటంతో అందులో తన పేరు ఉంటుందని ఆందోళన చెందుతున్న హైకోర్టు న్యాయవాది వెంకటేశ్వర్లు ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. బాలీవుడ్ నటి కాదాంబరీ జెత్వానీ కేసులో అక్టోబర్ ఒకటో తేదీ వరకు పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన సమయం ఈరోజుతో ముగుస్తుండటంతో మరోసారి విచారణ జరగనుంది.

Accused in Bollywood actress Kadambari Jethwani case went to court seeking bail

హైకోర్టులో బెయిల్ తీసుకోవాలని ఐపీఎస్ అధికారులు, కొందరు వైసీపీ నాయకులు, న్యాయవాది వెంకటేశ్వర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో ఇంకా పలువురు పేర్లు చేరే అవకాశం ఉందని సమాచారం. తనతో పాటు తన తల్లిదండ్రులను చిత్రహింసలకు గురి చేసిన పోలీసు అధికారుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ముంబాయి నటి కాదాంబరీ జెత్వానీ పోలీసు అధికారులకు మనవి చేసింది. అయితే ఈ కేసును సమర్థవంతమైన అధికారికి అప్పగించాలని కోరుతూ వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+