అందుకే కెసిఆర్‌తో చేతులు కలిపారు: జగన్‌పై అచ్చెన్నాయుడు
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్ తన భాషను మార్చుకోవాలని, లేదంటే తాము కూడా అంతకంటే ఎక్కువగా మాట్లాడగలమని ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అస్థిర పర్చేందుకే కెసిఆర్‌తో వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతులు కలిపారని ఆరోపించారు. రాజోలు బండను పేల్చేస్తామని కెసిఆర్ అంటే.. జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
కెసిఆర్‌తో చేతులు కలిపిన జగన్ రాజకీయ జీవితానికి పుల్‌స్టాప్ పడినట్లేనని ఆయన అన్నారు. శనివారం గోదావరి పుష్కరాల శోభాయాత్రపై జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

తెర వెనక జగన్.. తెర ముందు కెసిఆర్: యరపతినేని
తెరవెనుక జగన్‌మోహన్ రెడ్డి, తెరముందు కెసిఆర్ ఉండి చంద్రబాబుపై బురదజల్లాలని చేస్తున్నారని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. టీడీపీతో పెట్టుకున్న నేతలు ఎవరూ బాగుడలేదని ఆయన హెచ్చరించారు.
మంత్రి రావెలకు స్వల్ప అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్‌బాబు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శనివారం సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో రావెల అస్వస్థతకు గురవడంతో వెంటనే డాక్టర్లు ఆయనకు వైద్యం అందజేశారు.












Click it and Unblock the Notifications