Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పిటిషన్లు వెనక్కి, ల్యాంకోపై చర్యలు: హరీష్ రావు

సంగారెడ్డి/ హైదరాబాద్: ల్యాంకోకు ఇచ్చిన భూములు హైదరాబాద్ శివారులోని హుస్సేనిషావలి దర్గాకు చెందినవని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. అవి వక్ఫ్ ఆస్తులు కాదంటూ గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసును తాము వెనక్కి తీసుకుంటామని తెలిపారు. శుక్రవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ల్యాంకోకు ఇచ్చిన దర్గా భూములు వక్ఫ్ ఆస్తి అని, ఈ భూములు అమ్మడానికి, కొనడానికి వీల్లేదని గతంలోనే హైకోర్టు స్పష్టం చేసిందని, అప్పటి ప్రభుత్వం ఈ భూములు వక్ఫ్ ఆస్తి కాదంటూ సుప్రీంకోర్టులో కేసు వేసిందని ఆయన చెప్పారు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే ఇలా చేయడం కంచే చేను మేసినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ భూములు వక్ఫ్‌కే చెందాలని కేసు వేస్తామని హరీశ్ రావు చెప్పారు.

Harish Rao

అయితే ఈ భూముల్లో ల్యాంకో చేసిన నిర్మాణాలను కూలగొట్టకుండా పేదలకు పంచాలని దుబ్బాక ఎమ్యెల్యే రామలింగారెడ్డి కోరారు. వక్ఫ్‌భూములను కాపాడేందుకు తెలంగాణ వక్ఫ్ యాక్ట్ పేరిట శాసనసభలో చట్టం చేస్తామని హరీశ్‌రావు తెలిపారు.

వక్ఫ్ ఆస్తులను రక్షించేందుకు అవసరమైన అధికారాలను తహసీల్దార్లకు ఇస్తామన్నారు. వక్ఫ్ ఆస్తులపై ప్రతి నెలా సమీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

గురుకుల్ ట్రస్ట్ భూముల ఆక్రమణలపై గురిపెట్టిన తెలంగాణ సర్కారు తాజాగా ల్యాంకో హిల్స్‌పైనా దృష్టి సారించింది. ఏపీఐఐసీ నుంచి వేలంలో కొన్న భూముల్లో ల్యాంకో హిల్స్ నిర్మాణం చేపట్టినప్పటికీ ఇవి వక్ఫ్ భూములేనని, నిబంధనలకు విరుద్ధంగా వాటిని విక్రయించారని తెరాస మొదటి నుంచి వాదిస్తోంది.

ప్రభుత్వ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు సంబంధిత భూముల్లో ఇప్పటికే సర్వే నిర్వహించారు. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా న్యాయ నిపుణుల సలహా మేరకు ల్యాంకోపై అడుగు ముందుకేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఆ స్థలంలో ఇప్పటికే భవనాల నిర్మాణం పూర్తికావడంతో, భూమికి బదులు భూమిని వక్ఫ్‌బోర్డుకు కేటాయించడం లేదా ల్యాంకో భూముల క్రమబద్ధీకరణ ద్వారా వక్ఫ్ బోర్డుకు శాశ్వత ఆదాయం సమకూర్చాలని భావిస్తున్నట్లు తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+