Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాశ్మీర్‌లో రామ్ చరణ్- ఏరికోరి పంపించిన ప్రధాని మోదీ

శ్రీనగర్:ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. దీనికి సంబంధించిన కోలాహలం దేశంలో నెలకొంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఈ సమ్మిట్‌ను నిర్వహించబోతోంది భారత్. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన సన్నాహాక సమావేశాలు ఇప్పటికే మొదలయ్యాయి. విశాఖపట్నంతో పాటు బెంగళూరు, ముంబై, జైపూర్‌.. వంటి నగరాల్లో సన్నాహాక సదస్సులు ముగిశాయి.

తాజాగా- పర్యాటకరంగంపై ఏర్పాటైన జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశానికి జమ్మూ కాశ్మీర్‌ వేదికగా మారింది. శ్రీనగర్‌లో ఈ సాయంత్రం ఈ భేటీ ప్రారంభం కానుంది. ఇందులో పాల్గొనడానికి జీ20 సభ్య దేశాల ప్రతినిధులు, అధికారులు ఇప్పటికే జమ్మూ కాశ్మీర్‌కు చేరుకున్నారు. సభ్య దేశాల నుంచి 60 మంది ప్రతినిధులు దీనికి హాజరు కానున్నారు. షేర్‌-ఎ-కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ భేటీ ఏర్పాటైంది.

Actor Ram Charan arrives at Srinagar airport to attend the G20 Tourism Working Group meeting

జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా రద్దయిన తరువాత ఏర్పాటైన తొలి అంతర్జాతీయ సమావేశం ఇదే కావడం వల్ల దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జమ్మూ కాశ్మీర్‌ను ఉగ్రవాద రహిత కేంద్ర పాలిత ప్రాంతంగా తీర్చిదిద్దినట్లు ప్రపంచ దేశాలకు చాటి చెప్పే ఉద్దేశంలో ఉంది కేంద్రం. ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా పరిశీలిస్తోంది. సినిమా షూటింగులు తోడయితే పర్యాటకరంగాన్ని మరింత అభివృద్ధి చేయొచ్చని భావిస్తోంది.

ఈ భేటీ నేపథ్యంలో- శ్రీనగర్‌ను స్థానిక అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. వేదికగా ఈ జీ-20 సన్నాహక సదస్సు జరుగుతుండటంతో అక్కడికి చేరుకునే మార్గమంతా చాలా అందంగా తీర్చి దిద్దారు. సీఆర్పీఎఫ్, సహస్త్ర సీమాబల్, రాష్ట్ర పోలీసులతో శ్రీనగర్‌లో గట్టి బందోబస్తును ఏర్పాట్లు చేశారు. మెరైన్, ఎన్‌ఎస్‌జీ కమాండోలను మోహరింపజేశారు. యాంటీ డ్రోన్ యూనిట్లను వినియోగిస్తోన్నారు.

Actor Ram Charan arrives at Srinagar airport to attend the G20 Tourism Working Group meeting

కాగా- ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ పాల్గొనబోతోన్నారు. దీనికోసం ఆయన కొద్దిసేపటి కిందటే శ్రీనగర్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఫిల్మ్ టూరిజం ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ కల్చరల్ ప్రిజర్వేషన్ అనే అంశంపై రామ్ చరణ్ ప్రసంగించనున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.

ఫిల్మ్ టూరిజం వల్ల పర్యాటకరంగం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందనే విషయంపై తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఆర్ఆర్ఆర్‌లోని నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డ్ లభించిన తరువాత రామ్ చరణ్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. అదే ఇప్పుడు ఆయనను జీ20 సమ్మిట్‌లో భాగస్వామిని చేసింది. ఫిల్మ్ టూరిజం ఫర్ ఎకనామిక్ గ్రోత్ అంశంపై చర్చించడానికి ప్రధాని మోదీ ఏరికోరి రామ్‌ చరణ్‌ను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+