అది సరికాదు, పాత చింతకాయ పచ్చడి తినడం నచ్చలేదు: పవన్‌పై నటి మాధవీలత

అమరావతి/హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రముఖ నటి మాధవీలత ఓ సూచన చేశారు. ప్రతి బహిరంగ సభలో జనసేనానియే మాట్లాడుతారని, మిగతా వాళ్లు మాట్లాడటక పోవడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. కొందరు మాట్లాడినా ఎప్పుడో, ఎక్కడో మాట్లాడి అలా వెళ్లిపోతున్నారని తెలిపారు.

 విమర్శ కాదు సూచన

విమర్శ కాదు సూచన

ఈ మేరకు మాధవీలత తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తాను విమర్శించడం లేదని, సూచన మాత్రమేనని ఆమె పోస్ట్ ప్రారంభంలోనే పేర్కొన్నారు. సమావేశాల్లో పవన్ కళ్యాణ్ ఒక్కరే మాట్లాడటాన్ని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్‌ను కలవాలంటే ఆయన కార్యాలయం వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి అన్నారు.

పవన్‌ను కలిసేందుకు మార్గం లేదు

పవన్‌ను కలిసేందుకు మార్గం లేదు

పవన్ కళ్యాణ్‌ను అభిమానించేవాళ్లు, పలువురు సీనియర్ జర్నలిస్టులు ఈ మాటలు చెప్పారని, ఆయనను కలవాలంటే ఎంతోసేపు నిరీక్షించాలని చెప్పారని, వెయిట్ చేసి చేసి అసహనంతో, బాధతో వారు ఆ మాటలు చెప్పారని అన్నారు. ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని కలిసేందుకు ఓ విధానం ఉందని, కానీ పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు మాత్రం లేదని ఆమె అన్నారు.

పాతచింతకాయ పచ్చడి తినడం నచ్చలేదు

పాతచింతకాయ పచ్చడి తినడం నచ్చలేదు

జనసేనానిని కలిసే మార్గం అర్థం కావడం లేదని మాధవీలత అన్నారు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లోపం ఉందని అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయంలో పవన్ మాటల్లో క్లారిటీ లేదన్నారు. నిత్యం ఇతర పార్టీలను విమర్శించడమే కనిపిస్తోందన్నారు. ఇది సరైన విధానం కాదని తనకు అనిపిస్తోందని, మనం చేయబోయేది చెప్పాలని, రెచ్చగొట్టడం ఒకప్పటి రాజకీయమని, మార్పు కోసం వచ్చిన వారు పాత చింతకాయ పచ్చడి తినడం నచ్చలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మాధవీలత ఏం చెప్పారంటే?

మాధవీలత ఏం చెప్పారంటే?

'అయ్యా ఇది విమర్శ కాదు సలహా మాత్రమే. జనసేన మీటింగ్స్ అన్ని ఫాలో అవుతున్న ఒక్క మీటింగ్ లో కూడా వేరేవాళ్లు మాట్లాడారా??2 గంటలు 4 గంటలు కళ్యాణ్ గారి మాటలే న పక్కన మహిళలు డమ్మి గ ఉండటం ఏంటి?? ఎక్కడో ఎపుడో అలా అలా మాట్లాడి వెళ్తున్నారు స్టేజి మీద మొదట నాయకుడి స్పీచ్ ఉండదు కానీ ఇక్కడ ఎందుకు ఉంటుంది ఇంకా మాట్లాడే వారే లేదా?? ఇంకా పోతే ఆయన్ని కలవాలి అంటే జనసేన ఆఫీస్ దగ్గర వెయిటింగ్ వెయిటింగ్ అంట ఇది సీనియర్ జర్నలిస్ట్స్ లు ఆయన్ని అభిమానించే వాళ్ళు అసహనానికి గురై బాధ తో చెప్పిన మాటలు . సీఎం తో ఎలా కలవాలి సోర్స్ ఈజీ ఉంది . పీఎం ని కలిసే విధానం క్లియర్ గ ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారిని కలిసే మార్గం అర్ధం అవట్లేదు లేదు అని సమాచారం ఇది అడ్మినిస్ట్రేషన్ లోపం ఉందని గమనించాలి ... అధికారం లోకి వస్తే ఏమి చేస్తాము క్లారిటీ ఉండటం లేదు స్పీచెస్ లో . ఎంతసేపు పక్క పార్టీ లని విమర్శించమే ఎందుకో సరి ఐన విధానం కాదు మనమేంటి మనం ఎం చేస్తాం విధులు విధానాలు చెప్పాలి. ద్వేషాలని రెచ్చగొట్టడం ఒకప్పటి రాజకీయం . మార్పు కావాలని వచ్చిన వారు కూడా అదే పాత చింతకాయ పచ్చడి తినడం నచ్చలేదు నాకు . ఇది నా అభిప్రాయం..' అని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+