gautam adani:అదానీ: ఒక్కరోజులో జేబులోకి రూ.లక్ష కోట్లు
జనవరి నుంచి కొనసాగిన అదానీ-హిండెన్‌బర్గ్ వివాదానికి సుప్రీం కోర్టు విచారణలు ముగిశాయి. దీంతో అదానీ లిస్టెడ్ షేర్ల ర్యాలీ మెుదలైంది. ట్రేడింగ్ సెషన్లో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.లక్ష కోట్లు పెరిగింది. హిండెన్ బర్గ్ సంస్థ జనవరిలో ఆరోపణల తర్వాత మెుదటి సారిగా అదానీ విలువలో చెప్పుకోదగిన పెరుగుదల నమోదైంది.
క్యాపిటల్‌మార్కెట్ నుండి వచ్చిన డేటా ప్రకారం అదానీ గ్రూప్ స్టాక్‌ల మార్కెట్ క్యాప్ మంగళవారం దాదాపు రూ.11.31 లక్షల కోట్లకు పెరిగింది. ఇంతకుముందు సెషన్‌లో ఇది దాదాపు రూ.10.27 లక్షల కోట్లుగా ఉంది. కేవలం ఒకే ఒక్క ట్రేడింగ్ సెషన్‌లో గౌతమ్ అదానీ గ్రూప్ విలువ ఏకంగా రూ.1.04 లక్షల కోట్లు పెరిగింది. సెబీ కూడా తన దర్యాప్తు ముగిసిందని ప్రకటించడంతో భారీ లాభాలు నమోదయ్యాయి.

షేర్ల ర్యాలీని పరిశీలిస్తే.. ఫ్లాగ్‌షిప్ సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 8.66 శాతం పెరిగాయి. అదానీ టోటల్ గ్యాస్ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. దాదాపు 20 శాతం పెరిగాయి. అదానీ పవర్ షేర్లు 12.32 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 12.27 శాతం పెరిగాయి. అదానీ విల్మార్ షేర్లు 9.96 శాతం, అదానీ పోర్ట్స్ షేర్లు 5.20 శాతం, ఎన్‌డీటీవీ షేరు ధర 11.73 శాతం, అంబుజా సిమెంట్స్ షేరు ధర 4.22 శాతం, ఎసీసీ షేరు ధర 2.62 శాతం పెరిగాయి.
ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన గౌతం అదానీ హిండెన్ బర్గ్ ప్రకటన తర్వాత ఫిబ్రవరి నెలలో ఏకంగా 50 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయాడు. దాదాపు 130 బిలియన్ డాలర్లు నికర సంపదతో రెండో స్థానంలో నిలిచిన గౌతమ్ అదానీ 50 బిలియన్ డాలర్ల స్థాయికి పడిపోవడం వెనక హిండెన్ బర్గ్ ఎఫెక్ట్ కారణమని మార్కెట్ విశ్లేషకులు విశ్లేషించారు.












Click it and Unblock the Notifications