కృష్ణా ఎక్స్ ప్రెస్ లో ప్రమాదం?
ఈమధ్య కాలంలో రైలు ప్రమాద ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వారం రోజుల క్రితం ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో పొగలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది మరిచిపోకముందే శుక్రవారం తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్లే రైలులో పొగలు వచ్చాయి. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తుండగా కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలు బోగీల్లో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. వెంటనే చైన్ లాగి నిలిపేశారు.
తిరుపతి జిల్లా వెంకటగిరి-ఎల్లకారు మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే సిబ్బందికి తెలియజేయడంతో హుటాహుటిన సంఘటనకు చేరుకున్నారు. బోగీల్లోంచి పొగలు రావడానికి కారణాలను పరిశీలించారు. బ్రేకులు పట్టేయడం వల్లే పొగలు వచ్చినట్ గుర్తించారు. ప్రమాదం ఏమీ లేదని రైల్వే అధికారులు చెప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 20 నిముషాలు రైలు నిలిచిపోయింది. సిబ్బంది మరమ్మతులు చేపట్టడంతో అరగంట ఆలస్యంగా బయలుదేరి వెళ్లింది. పొగలను గమనించి వెంటనే స్పందించడం వల్ల పెనుప్రమాదం తప్పిందని రైల్వే సిబ్బంది తెలిపారు.

పొగలు వచ్చిన సమయంలో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలులోనే మంటలు అంటుకుంటున్నాయని ఆందోళన చెందారు. చైన్ లాగిన వెంటనే బయటకు పరిగెత్తారు. రైలు వెంకటగిరి రైల్వేస్టేషన్ లో నిలిచిపోయింది. ఈ ఏడాది జూన్ ఆరోతేదీన ఒడిశాలో సికింద్రాబాద్-అగర్తల ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. బీ5 బోగీలో మంటలు రావడంతో పాటు బోగీ అంతటా దట్టంగా పొగ వ్యాపించింది. ఈ ఏడాది జూన్ 22న లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు వచ్చాయి. జులై 7వ తేదీన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో మంటలు వ్యాపించి ఏడు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి.












Click it and Unblock the Notifications