సీఎం జగన్ కు ఆదినారాయణ రెడ్డి సవాల్ - జమ్మలమడుగు నుంచే..!!
మాజీ మంత్రి..ప్రస్తుత బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సీఎం జగన్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. సవాల్ విసిరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి తరువాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా రాజకీయ విమర్శలు చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ వెంటనే ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు.
జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి రాజకీయ ప్రత్యర్ధి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. ప్రస్తుతం జమ్మల మడుగు నుంచి సుధీర్ రెడ్డి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కొద్ది నెలల క్రితం ఆదినారాయణ రెడ్డి సోదరుడు భూపేష్ రెడ్డి టీడీపీ నుంచి జమ్మలమడుగు బాధ్యలు పర్యవేక్షిస్తున్నారు. అయితే, ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి సీఎం జగన్ కు సవాల్ చేసారు. ముఖ్యమంత్రి అమరావి రైతులు..అక్కడి ప్రజలతో పాటుగా తన వెంట్రుక కూడా పీకలేరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జమ్మలమడుగులో నిర్వహించిన బీజేపీ యువసంఘర్షణ స్కూటర్ ర్యాలీలో పాల్గొన్నారు.

Recommended Video

వచ్చే ఎన్నికల్లో తాను జమ్మలమడుగు నుంచే పోటీ చేస్తానని.. చేతనైతే తనను ఓడించాలని సవాల్ చేసారు. రాష్ట్రానికి జగన్ దరిద్రం పోవాలని వ్యాఖ్యానించారు. తనకు వైఎస్ వివేకా రాజకీయ గురువుగా చెప్పుకొచ్చారు. ఆయన్ను చంపింది ఎవరో అందరికీ తెలుసని పేర్కొన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పైన కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ ను అధికారం నుంచి సాగనంపేందుకే తాము యాత్ర చేపట్టామని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications