మరో రాష్ట్ర రాజధాని నుంచి కాదు, విజయవాడ నుంచే పాలన సాగాలి: హరిబాబు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పాలన విజయవాడ నుంచే కొనసాగాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపి హరిబాబు అన్నారు. హైదరాబాద్ నగరం తెలంగాణ రాజధానిగా ఉందని, ఈ నేపథ్యంలో మరో రాష్ట్ర రాజధాని నుంచి పాలన చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

శనివారం విజయవాడలో బిజెపి రాష్ట్ర స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడారు. ఈ సమావేశానికి బిజెపి మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హజరయ్యారు.

Administration should continue from Vijayawaday, says Haribabu

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకులు భారీగా కసరత్తు చేస్తున్నారు. అందులోభాగంగా గ్రామ, మండల, జిల్లా, కార్పొరేషన్ స్థాయి అధ్యక్ష ఎన్నికలపై నాయకులు ఈ సందర్భంగా భారీ కసరత్తు చేయనున్నారు.

అదేవిధంగా రాష్ట్ర బిజెపికి కొత్త అధ్యక్షుడ్ని డిసెంబర్ రెండవ వారంలో ఎన్నుకునే అవకాశం ఉంది. ఆ అంశంపై కూడా నేతలు చర్చించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+