
ఆప్ఘన్ హెరాయిన్ తో తూ.గో జిల్లాకు లింకులు-ద్వారపూడిలో సుధాకర్ బస- ఉలిక్కిపడ్డ నిఘా
ఆప్ఘనిస్తాన్ నుంచి భారత్ కు అక్రమంగా తరలించిన హెరాయిన్ గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన ఘటన తర్వాత దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏపీతోనూ దీనికి లింకులున్నట్లు తీవ్ర ఆరోపణలు వచ్చినా ప్రభుత్వంతో పాటు డీజీపీ కూడా వీటిని ఇన్నాళ్లూ తోసిపుచ్చుతూ వచ్చారు. కానీ తాజాగా ఆప్ఘన్ హెరాయిన్ రవాణాలో నిందితుడిగా డీఆర్ఐ అధికారులు అరెస్టు చేసిన మాచవరం సుధాకర్ కు తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడితో లింకులు ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో నిఘా వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

ఆప్ఘన్ హెరాయిన్ పై దర్యాప్తు
ఆప్ఘనిస్తాన్ నుంచి గుజరాత్ లోని ముంద్రా పోర్టుకు చేరుకున్న భారీ హెరాయిన్ డంప్ పై కేంద్ర స్ధాయిలో దర్యాప్తు సంస్ధలు దర్యాప్తు చేపడుతున్నాయి. డిపార్ట్ మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజిన్స్ తో పాటు వివిధ నిఘా, దర్యాప్తు సంస్ధలు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఈ హెరాయిన్ ఆప్ఘన్ నుంచి ఇరాన్ ద్వారా సముద్ర మార్గంలో ముంద్రా పోర్టుకు వచ్చినట్లు ఇప్పటికే దర్యాప్తు సంస్ధలు గుర్తించాయి. ఈ హెరాయిన్ షిప్ మెంట్ తెప్పించిన విజయవాడకు చెందిన దంపతులు మాచవరం సుధాకర్, వైశాలిలను ఇప్పటికే డీఆర్ఐ అధికారులు అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు.

తూర్పుగోదావరితోనూ లింకులు
ఆప్ఘనిస్తాన్ నుంచి హెరాయిన్ తెప్పించిన నిందితుడు మాచవరం సుధాకర్ కు ఇప్పుడు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకూ లింకులు ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లి అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందు ఈ సుధాకర్ కు విజయవాడతోనే సంబంధాలు ఉన్నాయని, అయితే ఆయన ప్రస్తుతం చెన్నైలోనే ఉంటున్నారని ముందుగా భావించారు. ఏపీ పోలీసు అధికారులు కూడా ఇన్నాళ్లూ అదే విషయం చెప్తూ వచ్చారు. కాీ తాజాగా తూర్పుగోదావరి లింకులు కూడా బయటపడ్డాయి.

ద్వారపూడిలో నివాసం
ఆప్ఘనిస్థాన్ నుండి ఢిల్లీకి తరలిస్తున్న మాదకద్రవ్యాలు గుజరాత్ లో పట్టుబడగా ఈ కేసుకు తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట నియోజకవర్గంలో ఉన్న ద్వారపూడితో లింక్ ఉండటంతో జిల్లా నిఘా వర్గాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి.
ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మాచవరపు సుధాకర్ తన తల్లి సోదరుడితో కలిసి ద్వారపూడి లో నివాసం ఉంటున్నట్లు తాజాగా తేలింది. ఇప్పటివరకూ మన పోలీసులు మాత్రం ఆయన రాష్ట్రంలో ఉండటం లేదని, చెన్నైలో మాత్రమే ఉంటున్నారని, విజయవాడ అడ్రస్ మాత్రమే ఇచ్చారని చెప్తూ వచ్చారు. తాజాగా వెల్లడైన విషయాలతో ఇదంతా అబద్ధమేనని తేలిపోయింది.
Recommended Video

అమాయకుడంటున్న తల్లి
ద్వారపూడిలో స్థానికులకు మాచవరం సుధాకర్ విశాఖలో ఉంటున్నారని మాత్రమే తెలుసు.గడిచిన ఆరేళ్లుగా ద్వారపూడికి ఆయన రాలేదని స్థానికులు చెబుతున్నారు. విశాఖలో ఓ ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్టు ప్రచారంలో ఉందని స్థానికులు అంటున్నారు. అటు సుధాకర్ అలాంటి వాడు కాదని,. చిన్నప్పటి నుంచి బాగా చదువుకున్నాడు. ప్రైవేటు కంపెనీల్లో మంచి ఉద్యోగాలు రావడంతో కోల్ కతా, వైజాగ్,చెన్నైలో పనిచేశాడని ఆయన తల్లి తల్లి వెంకటేశ్వరమ్మ చెబుతోంది..కరోనా తర్వాత ఉద్యోగం మానేశాడని, .అప్పుడే ట్రాన్స్ పోర్ట్ కంపెనీ పెట్టుకున్నాడని కూడా తెలిపారు..ఏం జరిగిందో తమకు తెలియదుని, తాము ఇప్పటికీ అద్దె ఇంట్లో ఉంటున్నామని ఆమె వెల్లడించారు. సుధాకర్ చాలామందికి సహాయమే చేశాడు గానీ ఎప్పుడూ అన్యాయం చేయలేదని ఆమె చెప్తున్నారు. .టీవీలో చూసినప్పటి నుంచి కన్నీరు ఆగడం లేదని, . ఈ కేసులో మా వాడిని ఎవరో ఇరికించారని సుధాకర్ తల్లి వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు.