కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో పోలీసు మార్క్ మానవత్వం-వృద్ధురాలిని మోసుకుంటూ వరద నుంచి కాపాడిన హోంగార్డు

|
Google Oneindia TeluguNews

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీ, ,తమిళనాడులోని పలుప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఇందులో వేలాది మంది ప్రజలు చిక్కుకుని అల్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో పోలీసులు వారిని కాపాడుతూ తమ విధినిర్వహణలో నిబద్ధతను చాటుకుంటున్నారు.

చెన్నైలో వరదల్లో చిక్కుకుని అపస్మారక స్ధితిలోకి వెళ్లిన ఓ వ్యక్తిని భుజాలపై మోసుకుంటూ వెళ్లి ఆటోలో ఎక్కించి ఆస్పత్రికి పంపి ప్రాణాలు కాపాడిన మహిళా పోలీసు ఘటన దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. మహిళా పోలీసు అయి ఉండి కూడా ఓ పురుషుడ్ని భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఘటనతో పోలీసు వ్యవస్దపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇలాంటిదే మరో ఘటన తాజాగా ఏపీలోని కడప జిల్లాల్లో చోటు చేసుకుంది.

after chennai police, now andhras kadapa home guard rescue old woman during floods

బంగాళాఖాతంలో వాయుగుండంతో రాయలసీమలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇదే క్రమంలో కడప జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. కడప తాలూకా పరిధిలో బుగ్గవంక పరివాహక ప్రాంతంలో నీరు చుట్టుముట్టింది. దీంతో శాస్త్రి నగర్ వద్ద విధులు నిర్వహిస్తున్న హోంగార్డు రమేష్... వరద నీటిలో చిక్కుకుపోయిన వృద్ధ మహిళను కాపాడారు.
సాహసోపేతంగా వెళ్లి నీటిలో చిక్కుకుపోయిన కుటుంబాన్ని రమేష్ రక్షించారు. అంతేకాదు ఆ కుటుంబంలో వృద్ధ మహిళను సైతం రెండు చేతులతో మోసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో దింపారు.

వరద నీటిలో మహిళ చిక్కుకుంది తెలియగానే అక్కడికి చేరుకున్న రమేష్ వెంటనే చేతులపై మోసుకెళ్లి మరీ ఆమెను ఆటోలో సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీంతో కడప జిల్లా పోలీసు శాఖకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. రమేష్ సేవలను స్థానికులు కొనియాడుతున్నారు.హోమ్ గార్డు రమేష్ ను జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ అభినందించారు. పోలీసు శాఖ అంటే ప్రజలకు సేవ చేయడానికే ఉందన్న విషయాన్ని నిరూపించడంతో పాటు కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ఓ కుటుంబాన్ని రక్షించిన హోంగార్డు రమేష్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. చెన్నలో మహిళా పోలీసు ఓ వ్యక్తిని రక్షించిన ఘటన జరిగిన 24 గంటల్లోనే కడపలో కుటుంబాన్ని హోంగార్డు రమేష్ రక్షించిన తీరుపై పోలీసు వర్గాలతో పాటు సాధారణ ప్రజలు సైతం అభినందిస్తున్నారు.

English summary
after chennai woman police rescue a man while flooding, now andhrapradesh's kadapa home guard ramesh also save a old women in floods.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X