అమ్మానాన్న చనిపోతే మంత్రినయ్యా.. ఇలాంటి దారుణ పరిస్థితి మరెవరికీ వద్దు: అఖిలప్రియ
అమ్మ శోభ, నాన్న నాగిరెడ్డి చనిపోతే తాను మంత్రిని అయ్యానని, ఇలాంటి దారుణమైన పరిస్థితి మరెవరికీ రావద్దని భూమా అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు: కర్నూలులో జరిగిన టీడీపీ మినీ మహానాడులో ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. గత మహానాడులో నాన్న తన చేయి పట్టుకుని నడిపించారని, ఇప్పుడు కార్యకర్తలు నడిపిస్తున్నారని అన్నారు.
అమ్మ శోభ, నాన్న నాగిరెడ్డి చనిపోతే తాను మంత్రిని అయ్యానని, ఇలాంటి దారుణమైన పరిస్థితి మరెవరికీ రావద్దని భూమా అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటీష్ కు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, రాయలసీమలో కరువును పోగొట్టేందుకు కృషి చేసిన బుడ్డా వెంగళరెడ్డిల జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు.

ఇదిలా ఉంటే, భూమానాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల ఉపఎన్నిక సీటు కోసం ఇటు అఖిల ప్రియ కుటుంబం అటు ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి మధ్య పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఉపఎన్నిక అభ్యర్థిపై తుది నిర్ణయం అధినేతదే కావడంతో.. ఆయన నిర్ణయం కోసం ఇరు వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications