నిన్న ప్రవీణ్ ప్రకాష్..నేడు గౌతమ్ సవాంగ్: నెక్స్ట్..?: ఆ ఉన్నతాధికారేనా?

అమరావతి: ఏపీ ప్రభుత్వంలో ఉన్నతస్థాయి అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. అత్యున్నత స్థాయిలో పని చేస్తోన్న ఐఎఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానం చలనాన్ని కల్పించే ప్రక్రియ మరింత ముమ్మరమైంది. ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శిగా పని చేసిన ప్రవీణ్ ప్రకాష్‌ను బదిలీ చేయడంతో ఆరంభమైన ఈ ప్రాసెస్.. ఊపందుకుంది. ఇవ్వాళ ఏకంగా పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ బదిలీకి దారి తీసింది. ప్రవీణ్ ప్రకాష్, గౌతమ్ సవాంగ్ ఒక్కరోజు వ్యవధిలో బదిలీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 ఏపీ డీజీపీగా..

ఏపీ డీజీపీగా..

ఏపీ పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేస్తోన్నారు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఏపీ డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ కొద్దిసేపటి కిందటే జీవో విడుదల చేశారు.

 నో పోస్టింగ్..

నో పోస్టింగ్..

గౌతమ్ సవాంగ్‌కు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా సూచించింది. అటు ప్రవీణ్ ప్రకాష్; ఇటు గౌతమ్ సవాంగ్ బదిలీ- ఈ రెండు కీలక పరిణామాలు ఒకదాని వెంట ఒకటి చోటు చేసుకోవడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.. హాట్ టాపిక్‌గా మారింది. డిబేట్స్‌కు దారి తీసింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీకి కొన్ని కీలకమైన కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఒకటి- పీఆర్సీ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు నిర్వహించిన ఛలో విజయవాడ ఆందోళన. రెండు- ఢిల్లీ నుంచి ఒత్తిళ్లు వచ్చాయనే ప్రచారం సాగుతోంది.

ఇక్కడితో ఆగుతాయా..?

ఇక్కడితో ఆగుతాయా..?

అధికార వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైన ఉన్నతాధికారుల బదిలీ వ్యవహారం ఇక్కడితో ఆగుతుందా?.. అనే ప్రశ్నకు లేదనే సమాధానం వినిపిస్తోంది. మరి కొందరు ఉన్నతాధికారుల బదిలీకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఎంతవరకు నిజమో తెలియట్లేదు గానీ.. పోలీసు శాఖకే చెందిన మరో కీలక విభాగానికి చెందిన ఉన్నతాధికారి బదిలీ అవుతారనే ప్రచారం సాగుతోంది.

 బదిలీ కోసం ఒత్తిళ్లు..

బదిలీ కోసం ఒత్తిళ్లు..

ఆయనను కూడా బదిలీ చేయాలంటూ ముఖ్యమంత్రిపై ఒత్తిళ్లు వస్తున్నాయని అంటున్నారు. రేపో, మాపో దీనికి సంబంధించిన జీవో విడుదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్ వంటి అత్యున్నత అధికారులు అదే హోదాలో పదవీ విరమణ చేస్తుంటారు. రాష్ట్రంలో మాత్రం దీనికి భిన్నమైన వాతావరణం నెలకొంది. ఇదివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పుడు గౌతమ్ సవాంగ్.

నీలంసాహ్నీ..

నీలంసాహ్నీ..

నీలం సాహ్నీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశారు. ఆమెను ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం ఛైర్‌పర్సన్‌గా నియమించింది. డాక్టర్ సమీర్ శర్మ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేయడానికే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన పదవీ కాలం పూర్తయినప్పటికీ- వైఎస్ జగన్ విజ్ఞప్తి మేరకు ఆయన సర్వీస్‌ను కేంద్రం పొడిగించింది. మేలో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+