దేవుడి భారం అంటావా, హిందువుల మనోభావాలు దెబ్బతీశావ్!: బాబుపై మరో బీజేపీ ఎమ్మెల్సీ సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై మంగళవారం మరో బీజేపీ శాసన మండలి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం ఇక దేవుడి భారం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడం సరికాదని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు.

విజయవాడలో కూలగొట్టిన దేవాలయాలకు అతీగతీ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దాష్టీకంపై తీవ్ర వ్యతిరేకత ఉందని సదరు బీజేపీ ఎమ్మెల్సీ చెప్పారు.

మీ మాట నమ్మి వాజపేయి ఓడిపోయారు, నోట్లు పంచి గెలిచారు: బాబును దులిపిన వీర్రాజు

అదే పెద్ద చంద్రన్న కానుక

అదే పెద్ద చంద్రన్న కానుక

చంద్రన్న కానుకలు పక్కదారి పడుతోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు అందులో క్వాలిటీ కూడా లేదన్నారు. రేషన్ దుకాణాలలో అన్ని సరుకులు ఇస్తే అదే అతిపెద్ద చంద్రన్న కానుక అని ఆయన ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌తో కలిశావ్, మేం చెప్పామా, పవన్ కళ్యాణ్ వల్లే: బాబుపై వీర్రాజు సంచలనం

  బాబుకు వీర్రాజు ఊహించని షాక్! 2014లో చంద్రబాబు గెలిచేవారా ?
  రగడ ప్రారంభమైంది

  రగడ ప్రారంభమైంది

  ఇటీవలి కాలంలో బీజేపీ నేతలు పలువురు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు, టీడీపీ నేతల విమర్శలు, ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో బీజేపీ గెలుపు తర్వాత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలతో బీజేపీ - టీడీపీ మధ్య మరోసారి రగడ ప్రారంభమైంది.

  బాబు గతం తవ్వి విమర్శలు

  బాబు గతం తవ్వి విమర్శలు

  సోము వీర్రాజు వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివాదం ముదరడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు.. రాజేంద్రప్రసాద్‌కు క్లాస్ పీకారు. ఆ తర్వాత వీర్రాజు.. రాజేంద్రప్రసాద్, చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా నిప్పులు చెరిగారు. బాబు గతం తవ్వి విమర్శించారు.

  బీజేపీ నేతలు ఎందుకు అలా

  బీజేపీ నేతలు ఎందుకు అలా

  ఇప్పుడు మరో ఎమ్మెల్సీ మాధవ్ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో బీజేపీ-టీడీపీ మైత్రిపై ఎప్పటికి అప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి. 2019 ఎన్నికల నాటికి బీజేపీ ఒంటరిగా పోటీ చేసేందుకు ఏమైనా ఆసక్తి చూపిస్తుందా అనే చర్చ సాగుతోంది. టీడీపీతో కలిసి ఉంటే ఎదగమని భావించి, సొంతగా పోటీ చేస్తే ఆ తర్వాత ఎన్నికల నాటికైనా బలం పెంచుకోవచ్చుననే ఉద్దేశ్యంతోనే బీజేపీ నేతలు ఎదురు దాడి చేస్తుండవచ్చునని అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  After Somu Veerraju, Another BJP MLC Madhav fired at Andhra Pradesh Chief Minister Chandrababu Naidu.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి