AP Phone tapping : ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ - వైసీపీ సర్కార్ పై టీడీపీ నేత డొక్కా షాకింగ్..!
తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడిందన్న విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే నిందితుల్ని కటకటాల వెనక్కి పంపింది. అదే సమయంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడిందని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు.
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందని టీడీపీ నేత డొక్కా ఇవాళ ఆరోపించారు. తెలంగాణ తరహాలోనే ఇక్కడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ ట్యాపింగ్ జరిగిందన్నారు. తనతో సహా పలువురి ఫోన్లను ట్యాప్ చేశారని డొక్కా ఆరోపించారు. ప్రజా ప్రతినిధుల ఫోన్లను, వారి వ్యక్తిగత కాల్స్ ను ట్యాప్ చేసినట్లు తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ విచారణ జరపాలని కొత్తగా ఏర్పడే కూటమి ప్రభుత్వాన్ని డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ట్యాపింగ్ పై దృష్టిపెట్టి నిందితులను తెలంగాణ తరహాలోనే కఠినంగా శిక్షించాలన్నారు. ఇప్పటికే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదం విపక్ష బీఆర్ఎస్ ను కుదిపేస్తున్న నేపథ్యంలో ఏపీలోనూ అవే తరహా ఆరోపణలు రావడంతో వైసీపీకి ఇబ్బందులు తప్పేలా లేవు.












Click it and Unblock the Notifications