తెరచుకున్న శ్రీవారి ఆలయ మహాద్వారం..!!
తిరుపతి: దేశవ్యాప్తంగా చంద్ర గ్రహణం కనువిందు చేసింది. చంద్రుడు పాక్షికంగా గ్రహణ ఛాయల్లోకి వెళ్లాడు. ఈ ఏడాది చివరి గ్రహణం ఇదే. శరద్ పౌర్ణమితో కలిసి వచ్చిన ఈ సెలెస్టియల్ ఈవెంట్.. దేశవ్యాప్తంగా కనిపించింది. ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ చంద్ర గ్రహణాన్ని వీక్షించారు స్టార్ గేజర్స్.
అర్ధరాత్రి దాటిన తరువాత 1:05 నిమిషాలకు గ్రహణ కాలం ఆరంభమైంది. గంటా 20 నిమిషాల పాటు కొనసాగింది. 1:44 నిమిషాలకు గ్రహణ ఛాయ అత్యధికంగా కనిపించింది. ఆ తరువాత గ్రహణం వీడటం ఆరంభమైంది. 2:22 నిమిషాలకు పూర్తిగా గ్రహణం ముగిసింది. ఇది పాక్షికం. ఆరు శాతం మాత్రమే గ్రహణ చీకటి చంద్రుడిని కమ్మింది.

భారత్‌తో పాటు ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాల ప్రజలు చంద్ర గ్రహణాన్ని తిలకించగలిగారు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఇరాన్, టర్కీ, అల్జీరియా, జర్మనీ, పోలాండ్, నైజీరియా, బ్రిటన్, స్పెయిన్, స్వీడెన్, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, జపాన్, ఇండోనేసియా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల్లో చంద్రగ్రహణం కనిపించింది.
గ్రహణాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల శ్రీవారి ఆలయం సహా అనేక దేవస్థానాలు మూతపడిన విషయం తెలిసిందే. ఈ తెల్లవారు జామున సంప్రోక్షణ, గ్రహణ శుద్ధి అనంతరం సంప్రదాయబద్ధ పూజలతో అర్చకులు ఆయా ఆలయాలన్నింటినీ తెరిచారు. సుప్రభాత సేవతో రోజువారీ పూజాదికాలను చేపట్టారు.
తిరుమలలో ఈ తెల్లవారు జామున ఆలయ తలుపులను తెరిచారు అర్చకులు. సంప్రోక్షణ, గ్రహణ శుద్ధి అనంతరం శ్రీవారి ఆలయం మహాద్వారాలను తెరిచారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు, పేష్కార్, కార్యనిర్వాహక అధికారి ఏవీ ధర్మారెడ్డి స్వామివారికి సుప్రభాత సేవను నిర్వహించారు. స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు.
#WATCH | Tirupati, Andhra Pradesh: After the lunar eclipse, the Tirumala Tirupati Devasthanam officials reopened the Sri Venkateswara Shrine doors on Sunday morning, cleaned the temple according to 'Shastras' and started the Suprabhata Seva.
— ANI (@ANI) October 29, 2023
Temple Deputy EO Lokanadam, Peskar… pic.twitter.com/JpyirpnnyR
వేదమంత్రోచ్ఛారణలు, గోవిందుడి నామస్మరణతో తిరుమల మారుమోగిపోయిందా సమయంలో. తెల్లవారు జాము నుంచే భక్తుల రద్దీ కనిపించింది. శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. శుక్రవారం నాడు 63,404 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 26,659 మంది తలనీలాలను సమర్పించారు.












Click it and Unblock the Notifications