వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్‌కు తెలిసేనా..ఇదేనా పార‌ద‌ర్శ‌క పాల‌న :నాడు టీడీపీని అన్నారు : ఎందుకీ ర‌హ‌స్యం...!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఇదేనా పార‌ద‌ర్శ‌క పాల‌న... ఏపీలో ఎందుకీ ర‌హ‌స్య జీవోలు..!! || Oneindia Telugu

ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసారు. అదే వేదిక నుండి జ‌గ‌న్ త‌న తొలి ప్ర‌సంగంతో అవినీతి ర‌హిత‌..పార‌ద‌ర్శ‌క పాల‌న అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేస్తాన‌ని స్ప‌ష్టం చేసారు. మంచి ముఖ్య‌మంత్రిని అనిపించుకుంటాన‌ని చెప్పుకొచ్చారు. కానీ, ఏం జ‌రుగుతోంది. అధికారుల‌కు జ‌గ‌న్ త‌న ల‌క్ష్యాల పైన స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదా. ఇచ్చినా తీరు మార‌లేదా. ప్ర‌భుత్వంలో అధికారుల తీరు మార‌టం లేద‌ని జ‌గ‌న్‌కు తెలియట లేదా..తెలిసే జ‌రుగుతుందా..ఇంత‌కీ ఎందుకీ ర‌హ‌స్యం.

18 రోజుల పాల‌న‌..18 ర‌హ‌స్య జీవోలు..

18 రోజుల పాల‌న‌..18 ర‌హ‌స్య జీవోలు..

ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప‌గ్గాలు చేప‌ట్టి 18 రోజులు అయింది. ఈ 18 రోజుల కాలంలో ప్ర‌భుత్వం 18 ర‌హ‌స్య జీవోలు జారీ చేసింది. గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వం ఇదే విధంగా ర‌హ‌స్య జీవోలు ఇవ్వ‌టం పైన వైసీపీ ఆందోళ‌న‌కు దిగింది. ప్ర‌భుత్వం అడ్డగోలుగా తీసుకున్న నిర్ణ‌యాల‌ను ర‌హ‌స్య జీవోల రూపంలో ఉత్త‌ర్వులు జారీ చేసిందని నాడు వైసీపీ ఆరోప‌ణ‌లు చేసింది. ఇప్పుడు 18 రోజుల పాల‌న‌లో 18 ర‌హ‌స్య జీవోల జారీ పైనా చ‌ర్చ మొద‌లైంది. మే30న ఏపీ సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసారు. ఇక‌, జూన్ 6వ తేదీన ఆర్దిక శాఖ‌లో నాలుగు జీవోలు జారీ అయ్యాయి. అదే విధంగా అదే రోజున ప్ర‌ణాళికా శాఖ‌లో నాలుగు జీవోలు ర‌హ‌స్యంగా ఉంచారు. ఇక ఈనెల 12వ తేదీన రెవిన్యూ శాఖ‌లో ఒక జీవో.. ఈనెల 14వ తేదీన కీల‌క‌మైన హోం శాఖ‌లో రెండు ర‌హ‌స్య జీవోల‌ను జారీ చేసారు.

సీబీఐకు అనుమ‌తిస్తూ ర‌హ‌స్యంగా..

సీబీఐకు అనుమ‌తిస్తూ ర‌హ‌స్యంగా..

చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఏపీలో సీబీఐకు సాధార‌ణ అనుమ‌తి ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అయితే, వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యం మేర‌కు ఆ ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేస్తూసీబీఐకి ఏపీలో సాధార‌ణ అనుమ‌తి ఇవ్వాల‌ని నిర్ణియించారు. ఈ విష‌యం బ‌హిరంగ ర‌హ‌స్యం. జ‌గ‌న్ సైతం అ విష‌యం ఎమ్మెల్యేల స‌మావేశంలో ఓపెన్‌గానే చెప్పారు. కానీ, దీనిని సైతం కాన్ఫిడెన్షియ‌ల్ జీవోగా అధికారులు ఉంచ‌టం ఇప్పుడు స‌చివాల‌య వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. అదే విధంగా ప్ర‌జ‌ల‌తో ముడి ప‌డి ఉన్న రెవిన్యూ ..ప్ర‌ణాళికా శాఖ‌ల్లోనూ ర‌హస్య జీవోలు ఇవ్వ‌టం తాజా ప్ర‌భుత్వంలో కొన‌సాగుతుండ‌టం పైన ఇప్పుడు కొంద‌రు అసెంబ్లీ లాబీల్లోనూ చ‌ర్చించుకుంటున్నారు.

ర‌హ‌స్య జీవీలో త‌ప్ప‌వా..

ర‌హ‌స్య జీవీలో త‌ప్ప‌వా..

ప్ర‌తీ నిర్ణ‌యం పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంద‌ని స్వ‌యంగా ముఖ్య‌మంత్రి చెబుతున్న స‌మ‌యంలోనే ర‌హ‌స్య జీవోలు జారీ చేయ‌టం అనేది ఉద్దేశ పూర్వ‌క‌మా...యాధృచ్చిక‌మా అనేది ఇప్పుడు తెలియాల్సిన విష‌యం. ప్ర‌భుత్వ ప‌రంగా పాల‌న‌లో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు ఉంటాయ‌ని అవి ఖ‌చ్చింగా రహ‌స్య జీవోలుగా ఉంచుతార‌ని..వీటి మీద కొంద‌రు కోర్టు ల‌కు వెళ్లే అవ‌కాశం ఉంటుంద‌నే ఉద్దేశంతోనే ఇలా జ‌రుగుతూ ఉంటుంద‌ని కొంద‌రు అధికారులు వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే..స్వ‌యంగా ముఖ్య‌మంత్రి చెబుతున్న దానికి..అధికారులు ఇస్తున్న వివ‌ర‌ణ‌కు మ‌ధ్య ఉన్న గ్యాప్ మాత్ర విమ‌ర్శ‌కుల‌కు అస్త్రంగా మారుతోంది. ఈ ర‌హ‌స్య జీవోల జారీ సంగ‌తి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు తెలిసినా లేకున్నా..మంత్రుల‌కు అయినా స‌మాచారం ఇస్తున్నారా అనేదే ఇప్పుడు అస‌లు ప్ర‌శ్న‌. దీనికి ప్ర‌భుత్వం ఏ ర‌కంగా స్పందిస్తుందో చూడాలి.

English summary
Aftet Jagan Taken oath as CM in this 18 days AP Govt issued 18 confidential GO's. CM Jagan saying that his govt will be more transparent and non corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X