త్వరలో రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడతాడు.. లేడీ అఘోరీ షాకింగ్ కామెంట్స్!
తెలుగు రాష్ట్రాలలో గత కొంతకాలంగా అఘోరి నాగసాధు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ముత్యాలమ్మ ఆలయంలో ఘటన చోటుచేసుకున్నప్పుడు తెలంగాణలోకి ఎంటర్ అయిన అఘోరి ముత్యాలమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేయడంతో పాటు సనాతన ధర్మ పరిరక్షణ కోసం తాను వచ్చానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఆలయాల పై వరుసగా దాడులు జరుగుతున్నాయని వీటిని తాను అడ్డుకుంటానని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపై లేడీ అఘోరీ సెన్సేషనల్ కామెంట్స్
సనాతన ధర్మం కోసం ఎక్కడి వరకైనా వెళ్తానని చెప్పిన అఘోరి అవసరమైతే ఆత్మ త్యాగం చేసుకుంటానని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోనూ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పలు దేవాలయాలను సందర్శిస్తూ అఘోరీ నాగ సాధు సెన్సేషన్ సృష్టిస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పైన అఘోరి నాగసాధు సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎంకు తెలిసే ఆలయాలపై దాడులు
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాళహస్తి, యాగంటి తదితర క్షేత్రాలను సందర్శించిన అనంతరం తిరిగి తెలంగాణకు చేరుకున్న అఘోరి నాగసాధు తాజాగా శంషాబాద్ కు చేరుకున్నారు. అక్కడ నవగ్రహ దేవాలయం, పోచమ్మ ఆలయాల దగ్గరకు వెళ్లి ఆలయాలను సందర్శించడంతోపాటు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.
సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయని వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడబోతున్నాడని చెప్పిన అఘోరీ
తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ఆలయాలు ధ్వంసం అవ్వడం పైన రేవంత్ రెడ్డి ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని ప్రశ్నించారు. త్వరలోనే రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడబోతున్నాడని లేడీ అఘోరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వరుసగా ఆలయాలు ధ్వంసం అవ్వడంపై కూడా అఘోరీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ కు ఈ ఘటనలన్ని తెలిసే జరుగుతున్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
భారీ మూల్యం చెల్లించుకోవాలన్న లేడీ అఘోరీ
ఒక సీఎంగా గొడవలను విగ్రహాల విధ్వంసాలను ఆపే స్థానంలో ఉండి కూడా రేవంత్ రెడ్డి వీటిని పట్టించుకోవడంలేదని లేడీ అఘోరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటికీ రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని త్వరలోనే రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై లేనిపోని అభాండాలు వేసి తనకు రాజకీయాలు అంటగడుతున్నారని లేడీ అఘోరి పేర్కొన్నారు.
తనపై చేస్తున్న ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని సవాల్
కొంతమంది తన పైన ఫేక్ అఘోరి అంటూ ప్రచారం చేస్తున్నారని అలాంటి వారిని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. తనకు విల్లా ఉందని కూడా ఆరోపణలు చేస్తున్నారని, తనపై చేస్తున్న ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. మన దేవుళ్లను, మహిళలను, అమాయకులను కాపాడాలని, ప్రతి ఒక్కరం వారిని కాపాడుకోవడం కోసం కృషి చేయాలని లేడీ అఘోరి స్పష్టం చేస్తున్నారు.
వారికి కఠినమైన శిక్షలు
రాష్ట్రంలో ఆలయాల జోలికి వెళ్లే వారికి, మహిళల జోలికి వెళ్లే వారికి కఠినమైన శిక్షలు ఉంటాయని లేడీ అఘోరి స్పష్టం చేశారు.మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి త్వరలో చిక్కుల్లో పడతాడని లేడి అఘోరి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి.












Click it and Unblock the Notifications