ఏపీలో షర్మిలతో కాంగ్రెస్ కొత్త గేమ్ ప్లాన్..!!

ఏపీలో కాంగ్రెస్ కొత్త వ్యూహాలతో ముందుకు వస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపాలని భావిస్తోంది. కాంగ్రెస్ లో చేరిన షర్మిలకు రాజ్యసభ ఖాయమైంది. కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపటంతో పాటుగా ఏపీలో నూ కీలక బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీలో నష్టపోయిన పార్టీకి తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పగిస్తున్నామంటూ పరోక్షంగా పీసీసీ పదవి పైన ఖర్గే సంకేతాలు ఇచ్చారని సమాచారం. ఇక, పార్టీలో చేరికల పైన కార్యాచరణ నిర్దేశించారు.

కాంగ్రెస్ కార్యాచరణ:వైఎస్ షర్మిల ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారుతున్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ లో చేరిన షర్మిల భవిష్యత్ అడుగులు ఏ విధంగా ఉంటాయనే చర్చ కొనసాగుతోంది. తాజాగా షర్మిల కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గేతో సమావేశమయ్యారు. ఏపీలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా పని చేయాలని సూచించారు. షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించాలని రాహుల్‌గాంధీ భావిస్తున్నారని, ఆయన అంచనాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. ఏప్రిల్‌లో కర్ణాటక నుంచి షర్మిలకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

AICC Decides to nominate YS Sharmila for Rajaysabha and appoint as party Campaigner

షర్మిలకు బాధ్యతలు:రాష్ట్రంలో కాంగ్రెస్‌ పునరుత్థానానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించాలని, ఇతర పార్టీల నుంచి చేరికల పైన ఫోకస్ చేయాలని సూచించినట్లు సమాచారం. ఏపీలో ప్రభుత్వ పాలన.. ప్రజల్లో ఉన్న అభిప్రాయం..ప్రతిపక్షాల పాత్ర పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తానని షర్మిల పేర్కొన్నారు . ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని, దీనిపై చర్చలు జరుగుతున్నాయని, ఒకటి రెండు రోజుల్లో స్పష్టత లభిస్తుందని షర్మిల చెప్పారు. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా షర్మిల పార్టీ పెద్దల్ని ఆహ్వానించారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజుతో సహా పార్టీ నేతలతో ఖర్గే సమావేశమయ్యారు. ఆ తరువాత అవసరమైన పీసీసీ పదవి త్యాగానికి సిద్దమని రుద్రరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి కరంగా మారాయి.

చేరికలు..బస్సు యాత్ర:ఏపీలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పూర్తిగా జగన్ వైపు మళ్లిందని..తిరిగి మాజీ కాంగ్రెస్ నేతలు సొంత గూటికి వచ్చేలా కార్యాచరణ సిద్దం చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ నేతలు తమతో టచ్ లో ఉన్నట్లుగా షర్మిల చెప్పినట్లు తెలుస్తోంది. షర్మిలకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించాలని రాహుల్ భావిస్తున్నారని..ఇందుకు సిద్దంగా ఉండాలని షర్మిలకు సూచించారని సమాచారం. తొలుత పాదయాత్ర చేయాలనే ప్రతిపాదన వచ్చినా ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో బస్సు యాత్ర దిశగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో ప్రియాంకను ఆహ్వానించి అమరావతి వేదికగా సభ నిర్వహించాలని నిర్ణయించారు. షర్మిలకు బాధ్యతలు ఖరారు చేసిన తరువాత పూర్తి స్థాయి కార్యాచరణ ప్రకటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+