స్వరాజ్యం ఫైర్: రేపిస్టుల దిష్టిబొమ్మ దగ్ధం(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో పెరిగిపోతున్న అత్యాచారాలకు నిరసనగా ఐద్వా ఆధ్వర్యంలో ఆర్టీసి క్రాస్ రోడ్డు వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రేపిస్టుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు మల్లు స్వరాజ్యం, ఇతర నేతలు పాల్గొని అత్యాచారాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇటీవల మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువతిపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. మరో ఘటనలో హైదరాబాద్ నగర శివారు ప్రాంతం పహాడీషరిఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఇలాంటి ఘటనలు నగరంలో రోజు రోజుకు పెరుగుతుండటంతో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఐద్వా కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసి క్రాస్ రోడ్డు వద్ద ధర్నా నిర్వహించారు.

ఆందోళన
నగరంలో పెరిగిపోతున్న అత్యాచారాలకు నిరసనగా ఐద్వా ఆధ్వర్యంలో ఆర్టీసి క్రాస్ రోడ్డు వద్ద మహిళలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రేపిస్టుల దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఆందోళన
ఈ నిరసన కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు మల్లు స్వరాజ్యం, ఇతర నేతలు పాల్గొని అత్యాచారాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆందోళన
ఆందోళనలో రేపిస్టుల దిష్టిబొమ్మకు నిప్పంటి కాలుతో తన్నుతున్న ఐద్వా నాయకురాలు మల్లు స్వరాజ్యం.

ఆందోళన
అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతుండటంతో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఐద్వా కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications