రేపు చంద్రబాబు పర్యటన, తిరుమలలోని మెట్లదారిలో తుపాకీ కలకలం
చిత్తూరు: తిరుపతిలో తుపాకీ కనిపించడంతో కలకలం చోటు చేసుకుంది. ముఖ్యంగా, బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలలో పర్యటించనున్నారు. ఇలాంటి సమయంలో తుపాకీని గుర్తించారు.
మెట్ల దారిలో ఎయిర్ పిస్టల్‌ను గుర్తు తెలియని వారు పడేశారు. దీనిని గుర్తించిన భక్తులు వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

టీటీడీ విజిలెన్స్ అధికారులు పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ముందు తుపాకీ దొరకడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications