సాంకేతిక లోపంతో నిలిచిన ఎయిర్ ఇండియా విమానం
విజయవాడ: సాంకేతిక లోపంతో గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం నిలిచిపోయింది. దీంతో, ప్రయణీకులు గంటలపాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది.
గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానం ఆదివారం నిలిచిపోయింది. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఢిల్లీ నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి విమానం వచ్చింది.

తిరిగి 70 మంది ప్రయాణీకులతో ఢిల్లీకి బయలుదేరింది. టేకాఫ్‌కు ముందే ఇంజిన్లలో సాంకేతిక లోపాన్ని పైలట్లు గుర్తించారు. ఎటిసి అధికారులకు సమాచారం అందించారు. దీంతో, ఈ విమానం ఢిల్లీ మీదుగా కనెక్టింగ్ విమానాలను అందుకునే ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.












Click it and Unblock the Notifications