కస్టమర్లకు ఎయిర్ టెల్, జియో అదిరిపోయే ఆఫర్లు
ఖాతాదారులను ఆకట్టుకోవడానికి, వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడానికి టెలికాం కంపెనీలు భారీగా ఆఫర్లు అందిస్తున్నాయి. తక్కువ డేటా వినియోగించే వారి కోసం జియో, ఎయిర్ టెల్ మంచి ఆఫర్లను తీసుకువచ్చాయి. రూ.100 కంటే తక్కువ ధరకే ఈ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ టెల్ ప్లాన్ రూ.99 నుంచి ప్రారంభమవుతుండగా, జియో యొక్క ప్లాన్ రూ. 91 నుండి ప్రారంభమవుతోంది.
జియో రూ.91 ప్లాన్ వివరాలు : 28 రోజులు చెల్లుబాటు అవుతుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 50 SMSలు, 3 GB డేటా లభిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది.

ఎయిర్ టెల్ రూ.99 ప్లాన్ వివరాలు : 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. సెకనుకు ఒకపైసా టాక్ టైమ్, 200 ఎంబీ డేటా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ లో ఎస్ ఎంఎస్ లు ఉండవు. రూ.99 టాక్ టైమ్ లభిస్తుంది.
ఎయిర్‌టెల్ తాజాగా ప్రీ పెయిడ్ రీచార్జ్ ప్లాన్ ధర రూ. 289 తీసుకువచ్చింది. రెండో సిమ్ కార్డు ఉపయోగించేవారికి అది అనువుగా ఉంటుంది. 35 రోజులు చెల్లుబాటు అవుతుంది. 35 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్ టెల్ తీసుకొచ్చిన తొలి రీఛార్జి ప్లాన్ ఇదే. వినియోగదారులకు ప్రస్తుతం ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. కంపెనీ వెబ్ సైట్ ద్వారా లేదంటే మొబైల్ యాప్ ద్వారా రీఛార్జి చేసుకోవచ్చు.4 జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్ లు ఉన్నాయి. వింక్ మ్యూజిక్ ఫ్రీ, ఉచిత హలో ట్యూన్స్, అపోలో 24/7 సేవలు లభిస్తాయి.












Click it and Unblock the Notifications