భూమా నాగిరెడ్డి చివరి క్షణాలు ఇలా.. అదే బెడ్‌పై శోభ మృతి: అఖిలప్రియ కంటతడి

తనను, తన తమ్ముడు, చెల్లెలును ఒంటరి వాళ్లను చేసి కానరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులను తలుచుకొని ఏడవటం నిన్నటితో ముగిసిందని, ఇక వారి గురించి తలుచుకొని ఏడుస్తూ కూర్చోవద్దని నిర్ణయించుకున్నానని చెప్పారు

విజయవాడ: తనను, తన తమ్ముడు, చెల్లెలును ఒంటరి వాళ్లను చేసి కానరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులను తలుచుకొని ఏడవటం నిన్నటితో ముగిసిందని, ఇక వారి గురించి తలుచుకొని ఏడుస్తూ కూర్చోవద్దని నిర్ణయించుకున్నానని చెప్పారు.

నంద్యాలలో పేదలకు పది వేల ఇళ్లు, రోడ్ల విస్తరణ, నీటి సమస్య తీర్చడంపై దృష్టిని పెడతానని, ఈ సమస్యలు తీరిన రోజున తన తండ్రిని తలుచుకొని మనసారా ఏడుస్తానన్నారు.

తనను అసెంబ్లీకి ఎవరూ పిలువలేదని, తన తమ్ముడిని, చెల్లిని కుటుంబ సభ్యులకు అప్పగించి వచ్చానని అఖిల ప్రియ చెప్పారు. కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు. ఇప్పుడిప్పుడే కార్యకర్తలకు తనపై నమ్మకం పెరుగుతోందని, అలాంటి సమయంలో తండ్రి బాధ్యత తనపై పడిందన్నారు.

bhuma nagi reddy

తన తండ్రి అస్వస్థతకు గురైనప్పుడు తొలుత ఆళ్లగడ్డకు, ఆ తర్వాత నంద్యాల తరలించామని అఖిల ప్రియ చెప్పారు. మెరుగైన చికిత్స కోసం తానెంతో తపించానని, ఎయిర్ లిఫ్ట్ చేయించేందుకు సహకారం అందించాలని సీఎం చంద్రబాబుకు ఫోన్ చేశానని చెప్పారు.

తనను భయపడవద్దని, అన్ని ఏర్పాట్లు చేయిస్తానని చంద్రబాబు చెప్పారని అఖిల ప్రియ అన్నారు. అరగంటకే హెలికాప్టర్ సిద్ధమైందని, హైదరాబాద్ తరలించాలనుకున్నామని, అప్పటికే దురదృష్టం కొద్ది ఆయన ఆరోగ్యంస్థిరంగా నిలువలేదన్నారు. ఆయన హార్ట్ బీట్ ఆగిందని డాక్టర్లు చెప్పాక, మరోసారి ప్రయత్నించాలని కోరామని, రెండు గంటలు ప్రయత్నించారని చెప్పారు.

పంప్ చేస్తుంటే, హార్ట్ బీట్ వస్తోందని, చెయ్యి తీసేస్తే హార్ట్ బీట్ పోతూ ఉందని, దీంతో తిరిగి గుండె కొట్టుకునే అవకాశాలు ఉన్నాయన్న ఆలోచనతో గంటల పాటు వైద్యులు కృషి చేశారని అఖిల ప్రియ చెప్పారు. అదే ఆసుపత్రిలో అదే బెడ్ పైన తన తల్లి చనిపోయిందని, ఇప్పుడు అదే బెడ్‌పై తన తండ్రి మరణించారన్నారు. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని కంటతడి పెట్టారు.

తన తల్లి మృతి చెందిన తర్వాత మూడేళ్ల పాటు తండ్రి బతికున్నారంటే.. తమ కోసమేనని ఇప్పుడు అర్థమవుతోందని అఖిల ప్రియ అన్నారు. తాను ఇంక అనాధను కానని, తన వెంట అసంఖ్యాక కార్యకర్తల బలం, చంద్రబాబు, లోకేష్‌ల అండ ఉందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+