అఖిలప్రియ సెల్ఫ్ గోల్ - TDP నుంచి నో టికెట్..?

మాజీ మంత్రి అఖిలప్రియ రాజకీయ భవిష్యత్ ఎటు. టీడీపీలో ప్రాధాన్యత దక్కుతుందా. తాము సీటు కోరటం కాదు..పది మందికి సీటు ఇప్పించే స్థాయి తమదని అఖిల కొంత కాలం క్రితం ధీమాగా చెప్పుకొచ్చారు. కానీ, పరిస్థితులు మారుతున్న కొద్దీ అఖిలకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతోంది. రాజకీయంగా వరుసగా అఖిల సెల్ఫ్ గోల్స్ చేసుకుంటున్నారనే అభిప్రాయం ఉంది. ఎన్నికల సమీపిస్తున్న వేళ వరుస వివాదాలతో టీడీపీ అధినాయకత్వానికి సమస్యగా మారుతున్నారు. దీంతో.. చంద్రబాబు నిర్ణయం కీలకం కానుంది.

అఖిల ప్రియ వివాదాలతో : భూమా కుటుంబానికి ఆళ్లగడ్డ..నంద్యాలలో మంచి పట్టు ఉంది. 2014 ఎన్నికల సమయంలో శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించటంతో కుమార్తె అఖిల రాజకీయాల్లోకి ప్రవేశించాల్సి వచ్చింది. ఉప ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. తండ్రి నాగిరెడ్డితో కలిసి టీడీపీలోకి ఫిరాయించారు. కొంత కాలానికే భూమా నాగిరెడ్డి మరణించారు. ఆ తరువాత అఖిల మంత్రి అయ్యారు. జిల్లాలో చక్రం తిప్పే ప్రయత్నం చేసారు.

akhila-cbn

పార్టీ నేతలలో విభేదాలు మొదలయ్యాయి. 2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో మొత్తం అన్ని సీట్లు వైసీపీ గెలిచింది. అఖిల మాజీ అయ్యారు. కానీ, 2019 ఎన్నికల తరువాత నుంచి వరుసగా అఖిల అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. ఫిర్యాదులు..కేసులు..వివాదాలు వెంటాడుతున్నాయి. ఇదే ఇప్పుడు టీడీపీలో అఖిలకు వచ్చే ఎన్నికల్లో సీటు గురించి చర్చకు కారణమవుతోంది.

టీడీపీలో సీటు దక్కేనా : ఆళ్లగడ్డ లో అఖిలకు అనుకూలత లేదని సర్వేలో తేలిందని ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే పలువురు నేతలు ఈ సారి టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అఖిలకు నంద్యాల సీటు ఇచ్చే అవకాశం ఉందనేది మరో టాక్. వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో అఖిల ప్రియ రాజకీయంగా ఒంటయ్యారు. పార్టీ నుంచి మద్దతుగా నిలిచే నేతలు కరువయ్యారు.

అఖిల‌ప్రియ‌ను విభేదించి వ‌రుస‌కు అన్న అయిన భూమా కిశోర్‌రెడ్డి బీజేపీలో చేరారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆళ్ల‌గ‌డ్డ బీజేపీ ఇన్‌చార్జ్‌. ఆళ్ల‌గ‌డ్డ నుంచి రానున్న ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అఖిల రెండు నియోజకవర్గాల్లో వ్యవహరిస్తున్న తీరు పైన టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ కూడా ఆగ్రహంగా ఉన్నారని పార్టీలో వినిపిస్తోంది. ఈ సారి ఎన్నికల్లో టీడీపీకి ప్రతీ సీటు కీలకం కానుంది. దీంతో కఠిన నిర్ణయాలు తప్పవనే వాదన వినిపిస్తోంది.

 akhilapriya

చంద్రబాబు నిర్ణయం ఏంటి : పార్టీలోనే కాకుండా ఎంతో కాలంగా అండగా నిలుస్తున్న వారు దూరం అవుతున్నారనే వాదన వినిపిస్తోంది. తాజాగా ఏవీ సుబ్బారెడ్డి పైన దాడి వ్యవహారం అందునా లోకేష్ పాదయత్ర వేళ జరగటం తో చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏవీ సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో సీటు ఆశిస్తున్నారు. ఎన్నికల వేళ పార్టీకి నష్టం చేసే ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసారు. అఖిల సోదరి మౌనిక మంచు మ‌నోజ్‌ను పెళ్లి చేసుకోనున్న నేప‌థ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ పైన చర్చ జరుగుతోంది.

మంచు కుటుంబానికి అటు టీడీపీ, ఇటు వైసీపీలో సాన్నిహిత్యం ఉంది. అయితే, అక్కకు పోటీగా మౌనిక రంగంలోకి వస్తారా రారా అనేది తేలాల్సి ఉంది. మౌనిక‌తో పాటు మంచు మ‌నోజ్‌కు కూడా రాజ‌కీయంగా ఆస‌క్తి వుంది. ఇద్ద‌రూ క‌లిసి ఆళ్ల‌గ‌డ్డ‌లో రాజ‌కీయం మొద‌లు పెడితే సానుకూలంగా మారే అవ‌కాశాలున్నాయనే వాదన ఉంది. దీంతో, ఇప్పుడు అఖిలకు సీటు విషయంలో చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+