జైల్లో ఉన్నప్పుడు మా అమ్మ సాయం, జగన్ మరిచారు, రెచ్చగొట్టొద్దు: అఖిల హెచ్చరిక
వైసిపి అధినేత జగన్ జైలులో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు చేసిన సాయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారని మంత్రి భూమా అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి: వైసిపి అధినేత జగన్ జైలులో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు చేసిన సాయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారని మంత్రి భూమా అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు.

శోభానాగిరెడ్డిని గౌరవిస్తామని చెబుతున్నారే గానీ
శోభా నాగిరెడ్డిని గౌరవిస్తున్నామని వైసిపి నేతలు చెబుతున్నారని, ఆమె పార్టీలో ఉండి మృతి చెందడం వల్లనే అలా అంటున్నారే తప్ప పార్టీలో లేకుంటే విమర్శలు చేసేవారన్నారు. ఈ విమర్శలకు మేం వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించకుండా రాజకీయాలు చేస్తామన్నారు.
Recommended Video


ప్రశాంతంగా ఉంటారు.. వారిని రెచ్చగొట్టొద్దు
13 ఏళ్లుగా ఉన్న దరిద్రాన్ని తొలగించి నంద్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు అఖిలప్రియ తెలిపారు. పేదల కోసం నిర్మించే ఇళ్లపై వైసిపి నాయకులు దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. నంద్యాల మహిళలు చాలా ప్రశాంతంగా ఉంటారని, వారిని వైసిపి నాయకులు రెచ్చగొట్టకూడదన్నారు.

శిల్పా చక్రపాణి రెడ్డి మాటల వల్లే
మహిళలను కించపరచడం వల్లనే ధర్నా చేస్తున్నారని, శిల్పా చక్రపాణి రెడ్డికి ఇది పద్ధతి కాదని, దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని అఖిలప్రియ కోరారు. ఎలాంటి చిచ్చు పెట్టకుండా కార్యక్రమాలు సజావుగా సాగడానికి సహకరించాలని కోరారు.

48 నామినేషన్లు
నంద్యాల ఉప ఎన్నికల బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులు 48 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ జులై 29న ప్రారంభమైంది. భూమా బ్రహ్మానంద రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డిలతో పాటు మజ్లిస్, అన్న వైయస్సార్, కాంగ్రెస్, రాయలసీమ పరిరక్షణ సమితి, సమాజ్‌వాది సహా పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. గడువు చివరి రోజు శనివారం ఏకంగా 28 నామినేషన్లు దాఖలయ్యాయి. నవతరం పార్టీ, అన్న వైయస్సార్ పార్టీ, మజ్లిస్, బీసీ యునైటైడ్ ఫ్రంట్, రాయలసీమ పరిరక్షణ సమితి, సమాజ్‌వాది పార్టీ, రాజ్యాధికార పార్టీలు నామినేషన్ పత్రాలు దాఖలు చేశాయి. మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications