విజ‌య‌వాడ రైలు ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. ప‌లు రైళ్లు ర‌ద్దు!

ఏపీలోని రైలు ప్రయాణికులకు అల‌ర్ట్‌.. విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలోని ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. డివిజ‌న్ ప‌రిధిలోని నిర్వహణ పనుల కార‌ణంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. 07977/07978 నెంబ‌ర్‌గ‌ల విజయవాడ-బిట్రగుంట మధ్య నడిచే రైళ్లను ఈ నెల 27 నుంచి జూన్ 23 వరకు ర‌ద్దు చేస్తున్న‌ట్లు తెలిపారు. వీటితో పాటు 17237/17238 అనే నెంబ‌ర్‌గ‌ల బిట్రగుంట-చెన్నై సెంట్రల్‌ రైళ్లను మే 27 నుంచి 31 వరకు, తిరిగి జూన్ 3 నుంచి 7 వరకు, జూన్ 10 నుంచి 14 వరకు, జూన్ 17 నుంచి జూన్ 21 వరకు ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.

విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో ట్రాక్‌కు సంబంధించి నిర్వహణ పనులు ఉండటంతో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 17243/17244 అనే నెంబ‌ర్‌గ‌ల గుంటూరు-రాయగడ ట్రైన్స్ మే 27 నుంచి జూన్ 24 వరకు రద్దు చేయ‌డం జ‌రిగింది. అలాగే 17267/17268 అనే నెంబ‌ర్‌గ‌ల కాకినాడ పోర్ట్, విశాఖపట్నం మధ్య నడిచే ట్రైన్స్ కూడా ర‌ద్ద‌య్యాయి. 07896 అనే నెంబ‌ర్‌గ‌ల మచిలీపట్నం-విజయవాడ ట్రైన్‌, 07769 అనే నెంబ‌ర్‌గ‌ల విజయవాడ-మచిలీపట్నం ట్రైన్‌, విజయవాడ-మచిలీపట్నం (07866), మచిలీపట్నం-విజయవాడ (07770), మచిలీపట్నం-విజయవాడ (07870), విజయవాడ-నర్సపూర్‌ (07861), నర్సపూర్‌-విజయవాడ (07863), విజయవాడ-భీమవరం జంక్షన్ (07283) రైళ్లను పాక్షికంగా రద్దు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ రైళ్లు విజయవాడ, రామవరప్పాడు మధ్య ఈనెల 27వ తేదీ నుంచి జూన్‌ 23 వరకు రద్దయ్యాయి.

Alert for Vijayawada train passengers Many trains are cancelled

మ‌రికొన్ని రైళ్లు దారి మ‌ళ్లింపు..

వీటితోపాటు మరికొన్ని రైళ్లను దారి మ‌ళ్లించిన‌ట్లు అధికారులు తెలిపారు. వయా విజయవాడ, గుడివాడ, భీమవరం, నిడదవోలు మీదుగా వెళ్లే రైళ్ల‌ను దారి మళ్లించిన‌ట్లు వివ‌రించారు. 22643 అనే నెంబ‌ర్‌గ‌ల ఎర్నాకులం-పాట్నా ట్రైన్స్‌ను మే 27, జూన్ 3, 10, 17న దారి మళ్లించిన‌ట్లు తెలిపారు. భావనగర్-కాకినాడ పోర్ట్ (12756) ట్రైన్‌నున‌ జూన్‌ 1, 8, 15, 22 తేదీల్లో దారి మళ్లించారు. 12509 అనే నెంబ‌ర్‌గ‌లబెంగళూరు-గౌహతి ట్రైన్ మే 29, 31, జూన్‌ 5, 7, 12, 14, 19, 21 తేదీల్లో దారి మళ్లించారు. 13351 అనే నెంబ‌ర్‌గ‌ల ధన్‌బాద్‌-అల్లపూజ ట్రైన్ మే 27 నుంచి జూన్‌ 23 వరకు దారి మళ్లించడం జ‌రిగింది. 11019 అనే నెంబ‌ర్‌గ‌ల చత్రపతి శివాజీ టెర్మినస్-భువనేశ్వర్ ట్రైన్ మే 27, 29, 31 తేదీల‌తో పాటు జూన్‌ 1, 3, 5, 7, 8, 10, 12, 14, 15 తేదీల్లో దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+