Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అలర్ట్: ఏపీలో ముఖ్యమైన రైళ్లన్నీ రద్దు

ఏపీలోని రైలు ప్రయాణికులకు ముఖ్యమైన సూచన.. కొరాపుట్‌-రాయగడ సెక్షన్‌లో భద్రతాపరమైన పనులు జరుగుతుండటంతో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటి దారి మళ్లించి తిప్పుతున్నారు. ఈ నెల 29, మే 3, 6 తేదీల్లో విశాఖ-కొరాపుట్‌(18512), ఈ నెల 30, మే 4, 7 తేదీల్లో కొరాపుట్‌-విశాఖ(18511) బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దయ్యాయి.

ఏప్రిల్‌ 28 నుంచి మే 8వ తేదీ వరకు విశాఖ-కొరాపుట్‌(08546), ఏప్రిల్‌ 28 నుంచి మే 9 వరకు కొరాపుట్‌-విశాఖ(08545) రైళ్లు రాయగడ వరకు నడుస్తాయి. తిరుగు ప్రయాణంలో రాయగడ నుంచే బయలుదేరుతాయి. అలాగే ఈ నెల 28వేతదీ ఉదయం 10.15 గంటలకు బయలు దేరాల్సిన ఎస్‌ఎంవీ బెంగళూరు-జాషిది (22305) ఎక్స్‌ప్రెస్‌ 29వ తేదీ ఉదయం 6.45 గంటలకు బయలుదేరనుంది.

alert somany trains cancelled in andhra pradesh state

విజయవాడ- కాజీపేట మార్గంలో ఇంజినీరింగ్‌ పనులు జరుగుతుండటంతో కొన్ని రైళ్లను బీబీనగర్, నల్గొండ, నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు మీదగా తిప్పుతున్నారు. విశాఖపట్నం ఎల్‌టీటీ- విశాఖపట్నం (18519)/(18520) రైలు ఈనెల 29 నుంచి మే 9వ తేదీ వరకు, తిరిగి మే 15 నుంచి 21వ తేదీ వరకు బీబీనగర్, నల్గొండ, నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా నడవనుంది.

షాలిమార్‌- హైదరాబాద్‌- షాలిమార్‌ (18045)/ (18046) మే 2, 3, 8, 9, 20, 21 తేదీల్లో గుంటూరు మీదుగా రాకపోకలు సాగిస్తుంది. సికింద్రాబాద్‌- షాలిమార్‌- సికింద్రాబాద్‌ (07225)/07226) ఈనెల 29, మే 6, 20 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు మీదుగా విజయవాడ వెళుతుంది. ప్రయాణికులు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని ప్రయాణానికి అనువుగా మార్పులు చేసుకోవాలని అధికారులు సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+