భక్తులకు అలర్ట్ : ఫిబ్రవరి 21న శ్రీశైలంలో మహా కుంభాభిషేకం..
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. శ్రీశైల మల్లిఖార్జున స్వామి దర్శించుకునేందుకు నిత్యం భక్తులు తరలివస్తుంటారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు మహా కుంభాభిషేకం, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు దేవాదాయశాఖ తెలిపింది. ఈ మేరకు దేవాదాయశాఖ ప్రభుత్వ లాయర్ హైకోర్టుకు నివేదించారు. ఈ నెల 21న మహా కుంభాభిషేకం నిర్వహిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. గతంలో శ్రీశైలం దేవస్థానంపై హైకోర్టులో వేసిన పిల్‌పై విచారణను మూసివేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్.రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేయడం జరిగింది.
గతంలో శ్రీశైలం దేవస్థానంపై అఖిల భారత వీరశైవ ధార్మిక ఆగమ పరిషత్ ఛైర్మన్ సంగాల సాగర్ హైకోర్టులో పిల్ వేశారు. మహా కుంభాభిషేకం, ఇతర కార్యక్రమాల నిర్వహణను వాయిదా వేస్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నదంటూ ఆయన హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. దీనిపై విచారణ సందర్భంగా దేవాదాయ కమిషనర్ హాజరై మహా కుంభాభిషేకం నిర్వహణపై పీఠాధిపతులు, పండితులతో సంప్రదిస్తున్నామని చెప్పారు. త్వరలో తేదీలను కూడా ఖరారు చేస్తామని ఆయన వివరించారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సాధ్యమైనంత త్వరగా ముహూర్తం ఖరారు చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు. ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 7న మరోసారి విచారణకు వచ్చింది.

మహాకుంభాభిషేకం నిర్వహించాలని కోరిన పిటిషనర్ : విచారణలో భాగంగా పుష్కరాల తర్వాత మహాకుంభాభిషేకం నిర్వహించాలని, పిటిషనర్ తరఫున లాయర్ వాదనలు వినిపించడం జరిగింది. 2016లో ముగిసిన పుష్కరాల తర్వాత సుమారు ఏడు సంవత్సరాల తర్వాత కోర్టు ఆదేశాలతో మహా కుంభాభిషేకం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఈ కుంభాభిషేకం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసిన సహేతుక కారణం లేకుండా రద్దు చేయడం జరిగింది. దీంతో మొత్తం రూ. 2 కోట్లు వృథా చేశారు. తక్షణమై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విచారణను మూసివేయొద్దని పిటిషనర్ కోరారు. అయితే, ఈ నెల 16 నుంచి 21 వరకు శ్రీశైలం దేవస్థానంలో మహాకుంభాభిషేకం ఇతర కార్యక్రమాలకు ముహూర్తం ఖరారు చేయడంతో ఈ విచారణను మూసివేస్తున్నట్లు అధికారులు తెలపారు.












Click it and Unblock the Notifications