కేరళలో భారీగా కరోనా కేసులు - అయ్యప్ప భక్తులకు తాజా అలర్ట్స్..!!
కరోనా కొత్త రూపంలో మరోసారి కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా క్రమేణా మరోసారి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమలకు వెళ్తున్నారు. దేశంలోనే అత్యధికంగా కేరళలో అధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేరళ వెళ్లే భక్తులకు తాజా అలర్ట్స్ జారీ అవుతున్నాయి. కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
పెరుగుతున్న కేసులు : ప్రస్తుతం రాష్ట్రం నుంచి అయ్యప్ప స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు శబరిమలై వెళ్తున్నారు. కేరళలో కరోనా విస్తరణ వేగం పుంజుకుంటున్నందున వీరంతా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. జనసందోహం ఉన్న ప్రదేశాలకు వీలైనంత వరకూ దూరంగా ఉండాలని, దర్శనం సమయంలో కచ్చితంగా మాస్క్ ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని సూచిస్తున్నారు. వీలైతే దర్శనం అనంతరం నేరుగా ఇంటికి వచ్చే అవకాశాలను పరిశీలించాలని చెబుతున్నారు. యాత్ర ముగించుకుని వచ్చిన స్వాముల్లో జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అయితే, కేరళలో ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ JN.1గా గుర్తించారు. ఐతే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

అప్రమత్తత అవసరం : కానీ..కరోనా రూపం మారుతున్న ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నెగెటివ్ ఫలితం వచ్చినా కుటుంబ సభ్యులకు దూరంగా హోం ఐసొలేషన్‌లో ఉండి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా వీలైనంత వరకూ తీర్థయాత్రలకు సంబంధించిన ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిదని పేర్కొంటున్నారు. ప్రభుత్వాసు అపత్రుల్లో, ప్రయివేటు ల్యాబ్‌ల్లో కొవిడ్ పరీక్షలు ప్రారంభించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసులు రాలేదు. కానీ అక్కడక్కడ పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. విశాఖపట్నం, తిరుపతి, కాకినాడలో ఇప్పటికే పాజిటివ్ వచ్చిన వారికి సంబంధించిన శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు సమాచారం. ఇటు అధికారులు అప్రమత్తం అయ్యారు.

జాగ్రత్తలు తీసుకోవాలి : ఏపీ నుంచి ఎక్కువమంది అయ్యప్ప భక్తులు కేరళ వెళ్లి వస్తున్నారు. ఇదే అతిపెద్ద ప్రమాదంగా మారుతుందేమోననినిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, శానిటైజర్ ఉపయోగించడంతో పాటు భౌతిక దూరం నిబంధన పాటించాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు జనసందోహం ఉన్న ప్రదేశాలకు వెళ్లొద్దని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఆంధప్రదేశ్‌కు సరిహద్దు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అత్యధికంగా కేరళలో 2,100 మందికి పాజిటివ్ వచ్చింది. కొత్త వేరియంట్‌కు సంబంధించి కర్ణాటకలో 80కిపైగా, తమిళనాడులో 70, మహారాష్ట్రలో 40, తెలంగాణలో 9 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఏపీలో కరోనా పైన సమీక్ష చేసిన ముఖ్యమంత్రి జగన్ ముందస్తు చర్యలపై అధికారులను ఆదేశించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications