• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేడే ఏపీ గవర్నర్ హరి చందన్ ప్రమాణ స్వీకారం .. సర్వం సిద్ధం

|
  మరికాసేపట్లో ఏపీ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న హరిచందన్ | AP New Governor Take's Charge Today

  ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ నేటి ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏపీ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు .ఇందుకోసం ఒకప్పుడు సీఎం క్యాంప్ కార్యాలయం నేటి రాజ్‌భవన్‌ ముస్తాబైంది. రాజ్ భవన్లో గవర్నర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. విభాజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన ఇంత కాలానికి ఏపీకి గవర్నర్ ను నియమించిన నేపధ్యంలో ఆయన ప్రస్తుత ప్రభుత్వంతో ఎలా ఉంటారు అన్నది ప్రధానాంశంగా మారింది.

  వీడియో: తిరుమ‌ల‌లో నూత‌న గ‌వ‌ర్న‌ర్‌!

  450 మంది విఐపిలను ఆహ్వానించిన ప్రభుత్వం .. బాధ్యతల స్వీకరణ నేడే

  450 మంది విఐపిలను ఆహ్వానించిన ప్రభుత్వం .. బాధ్యతల స్వీకరణ నేడే

  ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ జూలై 24 న రాజధాని ప్రాంతంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విజయవాడ పోలీసులతో సహా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 450 మంది విఐపిలను ఆహ్వానించారు. నాలుగు రకాల పాస్‌లు జారీ చేశారు. ఎ 1 పాస్‌లు కోర్టు న్యాయమూర్తులకు, ఎ 2 పాస్‌లు రాష్ట్ర మంత్రులకు, ఎంపిలు, ఎమ్మెల్యేలకు బి పాస్‌లు, ఎంఎల్‌సిలకు, సి పాస్‌లు కేంద్ర ప్రభుత్వ అధికారులకు మాత్రమే. కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం విజయవాడలో ఉదయం 11:30 గంటలకు ఎపి ప్రధాన న్యాయమూర్తి ఎపి చాగరి ప్రవీణ్ కుమార్ చేత నిర్వహించబడుతుందని తెలిసింది.

  ఆంధ్రప్రదేశ్‌కు సేవ చేసే అవకాశం తనకు లభించడం సంతృప్తినిస్తుంది అన్న గవర్నర్ హరి చందన్

  ఆంధ్రప్రదేశ్‌కు సేవ చేసే అవకాశం తనకు లభించడం సంతృప్తినిస్తుంది అన్న గవర్నర్ హరి చందన్

  హరిచందన్ మంగళవారం సాయంత్రం 5.50 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు . తిరుపతి నుంచీ గన్నవరం వచ్చిన గవర్నర్, ఆయన భార్య సుప్రభ హరిచందన్‌లకు రాష్ట్ర ప్రభుత్వం సాదరంగా స్వాగతం పలికింది. ఆ తర్వాత సాయుధ దళాల నుంచీ గౌరవ వందనం స్వీకరించారు గవర్నర్ దంపతులు . నెక్ట్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి... రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులను గవర్నర్‌కు పరిచయం చేశారు. ఇక తన రాక గురించి మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సేవ చేసే అవకాశం తనకు లభించడం సంతృప్తిగా ఉందన్నారు కొత్త గవర్నర్ హరి చందన్ .

   గవర్నర్ నివాసంపై తర్జన భర్జన .. చివరకు సీఎం క్యాంపు ఆఫీస్ నే రాజ్ భవన్ గా మార్చిన అధికారులు

  గవర్నర్ నివాసంపై తర్జన భర్జన .. చివరకు సీఎం క్యాంపు ఆఫీస్ నే రాజ్ భవన్ గా మార్చిన అధికారులు

  ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా బిశ్వ భూషణ్ హరి చందన్ ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే .. ఇంతవరకు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ, ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ ఇంతకాలం కొనసాగారు. కానీ ప్రస్తుతం నరసింహన్ ను తెలంగాణాకు పరిమితం చేస్తూ, ఏపీకి గవర్నర్ గా బిశ్వ భూషణ్ హరి చందన్ ను పంపించడంతో రాజ్ భవన్ సమస్య తలెత్తినా అధికారులు యుద్ధ ప్రాతిపదికన తాత్కాలికంగా నాలుగు దశాబ్దాలకు పైగా జలవనరుల శాఖ ఆఫీస్‌గా ఉన్న భవనాన్ని తీర్చి దిద్దారు.

  తక్కువ సమయంలో ఏర్పాట్లు బాగా చేశారని అధికారులను మెచ్చుకున్న కొత్త గవర్నర్

  తక్కువ సమయంలో ఏర్పాట్లు బాగా చేశారని అధికారులను మెచ్చుకున్న కొత్త గవర్నర్

  రాష్ట్ర విభజన తర్వాత కోట్ల రూపాయలతో గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో సీఎం క్యాంప్ ఆఫీస్‌ కోసం ఏర్పాట్లు చేశారు. గత సీఎం కొంతకాలంపాటు ఈ క్యాంపు కార్యాలయాన్ని వినియోగించారు. ఇందులో ఇప్పుడు మరిన్ని సౌకర్యాలతో రాజ్‌భవన్‌గా తీర్చిదిద్దారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆఫీస్, మొదటి అంతస్తులో నివసించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల్లోనే ఇవన్నీ చేయడం తో తక్కువ టైంలో రాజ్‌భవన్ లో చాలా బాగా ఏర్పాట్లు చేశారని కొత్త గవర్నర్ హరి చందన్ అధికారులను మెచ్చుకున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh's new Governor Biswabhushan Harichandan is all set to take charge on July 24 in the capital region. State government officials including Vijayawada Police have made an elaborate arrangement for the swearing-in ceremony. 450 VIPs have been invited for the swearing-in ceremony. Four types of passes have been issued. A1 Passes are meant for court judges, A2 Passes are meant for state ministers, B Passes have been issued to MPs, MLAs, and MLCs and C Passes are meant for central government officials. The oath of office of the new Governor would be administered by acting Chief Justice of AP Chagari Praveen Kumar at 11:30 am in Vijayawada, it is learned.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more