సర్వం సిద్ధం.. నేడు భోగాపురం ఎయిర్‌పోర్టులో ట్రయల్ రన్ !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యేక స్థానం పొందనుంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరే దిశగా ఈ ప్రాజెక్ట్ కీలక దశకు చేరుకుంది. విజయనగరం జిల్లాలోని భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు తొలి ట్రయల్ రన్ (టెస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్) నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ చారిత్రాత్మక ఘట్టం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

నేడు చారిత్రాత్మక ట్రయల్ రన్..

కాగా జీఎంఆర్ సంస్థ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకరరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. నేడు ఒక బిజినెస్ ఫ్లైట్ భోగాపురం ఎయిర్‌పోర్టు రన్‌వేపై విజయవంతంగా ల్యాండ్ కానుంది. ఈ ట్రయల్ రన్‌ను పర్యవేక్షించేందుకు ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో ఉదయం 10.15 గంటలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఉన్నతాధికారులు భోగాపురానికి చేరుకోనున్నారు.

all-arrangements-done-for-today-first-trial-run-in-bhogapuram-airport

ఈ టెస్ట్ ఫ్లైట్ ద్వారా రన్‌వే సామర్థ్యం, నావిగేషన్ సిస్టమ్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భద్రతా ప్రమాణాలు వంటి అంశాలను సమగ్రంగా పరీక్షించనున్నారు. విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే ముందు చేపట్టే అత్యంత ముఖ్యమైన దశనే ఈ ట్రయల్ రన్. దీన్ని ఆపరేషనల్ రెడీనెస్ అండ్ ఎయిర్‌పోర్ట్ ట్రాన్స్‌ఫర్ (ORAT) ప్రక్రియగా వ్యవహరిస్తారు. ఈ కమర్షియల్ వ్యాలిడేషన్ ఫ్లైట్ ద్వారా విమానాశ్రయం పూర్తిస్థాయిలో విమాన రాకపోకలకు సిద్ధంగా ఉందా లేదా అన్నది నిర్ధారించనున్నారు. ఇప్పటికే సుమారు 95 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని జీఎంఆర్ అధికారులు తెలిపారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రత్యేకతలు..

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అత్యంత ఆధునిక సాంకేతికతతో, ప్రత్యేక డిజైన్‌తో నిర్మిస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్టును చేప (ఫిష్) ఆకారంలో రూపొందించడం విశేషం. హుద్ హుద్ వంటి తీవ్ర తుపాన్లను కూడా తట్టుకునేలా, గంటకు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా చెక్కు చెదరకుండా నిర్మాణం చేపట్టారు. ఒకేసారి 27 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసినా నీరు నిలవకుండా అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

అంతే కాకుండా ఇక్కడ రోజుకు సుమారు 200 విమానాలు ఇక్కడ ల్యాండ్ అయ్యే సామర్థ్యం ఉండగా.. రాత్రి సమయంలో 18 విమానాలు పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది. 14 ఇమిగ్రేషన్ కౌంటర్లు, సెల్ఫ్ బ్యాగేజీ డ్రాప్, సెల్ఫ్ బోర్డింగ్ గేట్లు, స్మార్ట్ ట్రాలీలు, ఆధునిక కిచెన్ సౌకర్యాలతో ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవలు అందించనున్నారు.

సుమారు రూ.4,592 కోట్ల అంచనా వ్యయంతో 2,203 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేను నిర్మించారు. దీనివల్ల బోయింగ్ 777, ఎయిర్‌బస్ ఏ380 వంటి భారీ అంతర్జాతీయ విమానాలు కూడా సులభంగా రాకపోకలు సాగించగలవు. తొలి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా టెర్మినల్ భవనాన్ని తీర్చిదిద్దుతున్నారు.

ప్రారంభ తేదీలు..

విమానాశ్రయ నిర్మాణ పనులు పూర్తయ్యాక జూన్ 26న లాంఛనంగా ప్రారంభం చేయనున్నారు. జులై తొలి వారం నుంచే వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. 2026 ఆగస్టు నాటికి పూర్తిస్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గతంలో వెల్లడించారు.

ఈ విమానాశ్రయం ప్రారంభమైతే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతకు అనుగుణంగా, జీఎంఆర్ గ్రూప్ 500 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఏరోస్పేస్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయనుంది.

ఇక ప్రపంచంలోనే అతిపెద్ద మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ (MRO) యూనిట్‌ను ఏర్పాటు చేసి, భోగాపురాన్ని పూర్తి స్థాయి ఏరోస్పేస్ హబ్‌గా మార్చే లక్ష్యాన్ని జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ జి.ఎం. రావు వెల్లడించారు. మరోవైపు భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే విశాఖపట్నం సౌత్ ఇండియాలోనే ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక అభివృద్ధికి కూడా కీలకంగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+